Begin typing your search above and press return to search.

కొత్త ప‌ద్ధ‌తిని ఫాలో అవుతున్న మైత్రీ మూవీ మేక‌ర్స్

యంగ్ యాక్ట‌ర్స్‌తో మీడియం బ‌డ్జెట్ మూవీస్‌ని ప్లాన్ చేస్తున్న ఈ సంస్థ వీటి నిర్మాణంలో ప్రాఫిట్ అండ్ షేర్ విధానాన్ని అమ‌ల్లో పెట్టాల‌నుకుంటోంద‌ట‌.

By:  Tupaki Desk   |   15 Jun 2025 8:00 AM IST
కొత్త ప‌ద్ధ‌తిని ఫాలో అవుతున్న మైత్రీ మూవీ మేక‌ర్స్
X

టాలీవుడ్‌లో ఉన్న ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల్లో టాప్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీగా పేరు తెచ్చుకున్న సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. `పుష్ప 2` సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా రీసౌండ్ ఇచ్చిన ఈ సంస్థ తన కార్య‌క‌లాపాల‌ని ఇత‌ర భాష‌ల‌కు కూడా విస్త‌రిస్తోంది. తెలుగులో ఇప్ప‌టికే టాప్‌ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌గా పేరు తెచ్చుకున్న మైత్రీ సంస్థ త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు నిర్మిస్తోంది. ఇప్ప‌టికే త‌మిళంలో స్టార్ హీరో అజిత్‌తో `గుడ్ బ్యాడ్ అగ్లీ` మూవీని నిర్మించింది.

ఇదే ఊపుతో `ల‌వ్ టుడే`, డ్రాగ‌న్ సినిమాల ఫేమ్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, ప్రేమ‌లు ఫేమ్ మ‌మిత బైజు జంట‌గా త‌మిళంలో `డ్యూడ్‌` మూవీని నిర్మిస్తోంది. రొమాంటిక్ యూత్‌ఫుల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని అక్టోబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతోంది. మేక‌ర్స్‌గా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్నా వీరిని అనేక స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. మేకింగ్ ఆల‌స్యం కావ‌డం, నిర్మాణ ప‌రంగా ఒత్తిడిని ఎదుర్కొంటుండ‌టం, ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల నుంచి క‌ఠ‌న నిర్ణ‌యాల‌ని ఎదుర్కొంటూ ఉండ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్ష‌భాన్ని ఎదుర్కొంటోంది.

ఇటీవ‌ల ఈ సంస్థ నిర్మించాని `రాబిన్ హుడ్‌` మూవీ భారీ న‌ష్టాల‌ని తెచ్చిపెట్టింది. అలాగే హిందీలో తొలి సారి నిర్మించిన `జాట్‌`, త‌మిళంలో అజిత్‌తో చేసిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రాలు ఈ సంస్థ‌కు భారీ న‌ష్టాల‌ని అందించి షాక్‌కు గురి చేశాయి. మైత్రీ సంస్థ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`, ఎన్టీఆర్‌తో `డ్రాగ‌న్‌` వంటి సినిమాల‌ని నిర్మిస్తోంది. ఇదే టైమ్‌లో యంగ్ స్టార్స్‌తో మ‌రికొన్ని సినిమాల‌ని లైన్‌లో పెడుతోంది. ఈ నేప‌థ్యంలోనే మైత్రీ సంస్థ స‌రికొత్త ప‌ద్ద‌తికి శ్రీ‌కారం చుట్టిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇక‌పై చేసే సినిమాల‌ని ప్రాఫిట్ షేర్ విధానంలో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. యంగ్ యాక్ట‌ర్స్‌తో మీడియం బ‌డ్జెట్ మూవీస్‌ని ప్లాన్ చేస్తున్న ఈ సంస్థ వీటి నిర్మాణంలో ప్రాఫిట్ అండ్ షేర్ విధానాన్ని అమ‌ల్లో పెట్టాల‌నుకుంటోంద‌ట‌. ఈ ప‌ద్ద‌తిని పాటిస్తూ హీరోల‌కు మిమిమ్ పారితోషికాన్ని అందించి అనుకున్న బ‌డ్జెట్‌తో సినిమాని పూర్తి చేసి వ‌చ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ మార్పుని టాలీవుడ్ హీరోస్‌, డైరెక్ట‌ర్స్ ఎలా రిలీజ్ చేసుకుంటారో చూడాలని, రానున్న రోజుల్లో టాలీవుడ్‌లో మ‌రిన్ని స‌రికొత్త మార్పులు త‌థ్య‌మ‌ని అంతా అంటున్నారు.