Begin typing your search above and press return to search.

మైత్రీ.. ఈసారి క్లిక్ అయితే..

టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరోసారి తమ భారీ ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  M Prashanth   |   13 Jun 2026 4:00 PM IST
మైత్రీ.. ఈసారి క్లిక్ అయితే..
X

టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరోసారి తమ భారీ ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టార్ హీరోలు, క్రేజీ దర్శకులతో వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్‌ లో పెట్టిన ఆ సంస్థ, బాక్సాఫీస్ వద్ద తన డామినేషన్ మరింత పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఆ ప్రాజెక్టులన్నీ సక్సెస్ అయితే మైత్రీ ప్లేస్ మరింత స్ట్రాంగ్ గా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రిలీజ్ డేట్స్ ప్రకారం చూసుకుంటే.. మైత్రీ సంస్థ నుంచి రాబోయే అప్ కమింగ్ ప్రాజెక్ట్ రణబాలి. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఆ సినిమా బ్రిటీష్ పాలన కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్ తో మైత్రీ నిర్మిస్తున్న ఆ మూవీ.. సెప్టెంబర్ 11వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, 100 రోజుల షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది.

రణబాలి తర్వాత మైత్రీ బ్యానర్ ఫౌజీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఆ సినిమా.. పీరియడ్ వార్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది దసరా పండుగ కానుకగా థియేటర్స్ లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు సినిమాలు కాకుండా.. మైత్రీ లైనప్ లో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి భారీ విజయాల తర్వాత నీల్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. వచ్చే ఏడాది ఆ సినిమా థియేటర్స్ లో వచ్చేందుకు రెడీ అవుతోంది.

మైత్రీ నిర్మించనున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మూవీ AA23పై కూడా భారీ హైప్ ఉంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా, త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మైత్రీ బ్యానర్.. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న మూవీని కూడా నిర్మించనుంది. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందించనుంది.

అదే సమయంలో బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ సీక్వెల్ కూడా మైత్రీ లైనప్ లో ఉంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో రూపొందనున్న ఆ చిత్రం డివోషనల్- విజువల్ గ్రాండియర్ ట్రీట్ గా ఉండబోతోందని సమాచారం. పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఉండనున్నాయి. దీంతో మైత్రీ లైనప్ పై అందరి ఫోకస్ ఉంది.

అయితే లైనప్‌ లో ప్రతి సినిమా విజయం సాధించడం అంత ఈజీ కాదు. భారీ బడ్జెట్లు, పెరిగిన అంచనాలు, మారుతున్న ప్రేక్షకుల టేస్ట్ నిర్మాతలకు సవాళ్లుగా మారనున్నాయి. కానీ స్టార్ పవర్‌ తో పాటు సరైన కంటెంట్ కూడా క్లిక్ అయితే మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్‌ లోనే కాదు, ఇండియన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోనే టాప్ ప్లేస్ ను సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.