Begin typing your search above and press return to search.

బ్రాండ్ కాంట్ర‌వ‌ర్సీ..త‌మ‌న్నాని ఎంపిక వెన‌క పెద్ద స్కెచ్చే!

సినీ స్టార్స్ సినిమాల‌లో న‌టిస్తూనే ప్ర‌ముఖ బ్రాండ్‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Entertainment Desk   |   12 Feb 2026 8:00 PM IST
బ్రాండ్ కాంట్ర‌వ‌ర్సీ..త‌మ‌న్నాని ఎంపిక వెన‌క పెద్ద స్కెచ్చే!
X

సినీ స్టార్స్ సినిమాల‌లో న‌టిస్తూనే ప్ర‌ముఖ బ్రాండ్‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అవి కొంత కాలంగా వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌లుగా మారుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, అక్ష‌య్ కుమార్ న‌టించిన టోబాకో ప్ర‌మోష‌న‌ల్ యాడ్ విమ‌ల్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. దీంతో స‌ద‌రు సంస్థ‌తో త‌న కాంట్రాక్ట్ పూర్తి కావ‌డంతో అక్ష‌య్ కుమార్ ఈ బ్రాండ్ నుంచి త‌ప్పుకున్నాడు. ఆ త‌రువాత టైగ‌ర్ ష్రాఫ్ వ‌చ్చి చేరాడు. అయినా స‌రే దీనిపై విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. షారుఖ్ ఖాన్‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌ల‌ని ఓ రేంజ్‌లో నెటిజ‌న్‌లు ఆడేసుకుంటున్నారు.

ఆ త‌రువాత కూడా టొబాకో యాడ్‌ల‌లో న‌టిస్తున్న స్టార్‌ల‌పై నెట్టింట కామెంట్‌ల వార్ న‌డుస్తూనే ఉంది. తాజాగా క‌ర్ణ‌ట‌క‌కు చెందిన ఫేమ‌స్ సోప్ మైసూర్ సాండ‌ల్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. కొన్ని ద‌శాబ్దాలుగా ద‌క్షిణాదిలో అత్యంత పాపుల‌ర్ సోప్‌గా రిజిస్ట‌ర్ అయిన మైసూర్ సాండ‌ల్‌ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రమోట్ చేయాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగా దీనికి ప్ర‌చార క‌ర్త‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాని ఎంపిక చేసింది. ఇటీవ‌లే కాంట్రాక్ట్‌ని కూడా పూర్తి చేశారు.

అయితే దీనిపై ప్ర‌తిప‌క్ష బీజేపీతో పాటు క‌న్న‌డ వ‌ర్గాలు తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నాయి. క‌న్న‌డేత‌రుల‌ని ఎలా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియిమిస్తార‌ని, తాజా నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై మంత్రి ఎంబీ పాటిల్ ఆస‌క్తిక‌ర‌మైన వివ‌ర‌ణ ఇచ్చారు. త‌మ‌న్నాని ఎందుకు ప్ర‌చార క‌ర్త‌గా నియిమించాల్సి వ‌చ్చిందో స్ప‌ష్టం చేశారు. `కొన్ని నెల‌ల క్రితం త‌మ‌న్నాభాటియాను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎందుకు ఎంపిక చేశామో నేను స్ప‌ష్టంగా వివ‌రించాను. రజ‌నీకాంత్‌తో పాటు ఇత‌రులు ఉన్న క‌మిటీ ఐదారు పేర్ల‌ని సూచించింది. వారిలో ఇద్ద‌రు ముగ్గురు క‌ర్ణాట‌క‌కు చెందిన వారు.

అయితే వారిలో కొంత మంది ఇత‌ర బ్రాండ్‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాకుండా వారు ఇక్క‌డి బ్రాండ్‌కు ప్ర‌చార క‌ర్త‌గా ఉండ‌లేరు. మెజారిటీ స‌భ్యులు 28.3 క్రోర్స్ ఫాలోవ‌ర్స్ ఉన్న కార‌ణంగా త‌మ‌న్నాను మైసూర్ సాండ‌ల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించాం. ఈ సోప్ అమ్మాకాలు ఒక్క క‌ర్ణ‌ట‌క‌లో 8 నుంచి 18 శాతం, తెలంగాణ మ‌రియు ఇత‌ర రాష్ట్రాల్లో 18 శాతం, ఉత్త‌ర భార‌తంలో 8 శాతం, అంత‌ర్జాతీయంగా 1 శాతం అమ్మకాలు జ‌రుగుతున్నాయి. త‌మ‌న్నాని ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మించ‌డం అన్న‌ది పూర్తిగా క‌ర్ణాట‌క సోప్స్ అండ్ డిట‌ర్జెంట్స్ లిమిటెడ్ క‌మిటీ తీసుకున్న నిర్ణ‌యం.

ఇందులో ఎలాంటి పాలిటిక్స్ లేవు. క‌ర్ణాట‌కకు చెందిన దీపికా ప‌దుకునే తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్‌లు ఉన్నారు. వారు ఇత‌ర బ్రాండ్‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాని వ‌ల్లే వారిని ఈ ప్రోడ‌క్స్ట్‌కు ప్ర‌చార క‌ర్త‌లుగా ఎంచుకోలేక‌పోయాం. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మైసూర్ సాండ‌ల్ సోప్ అమ్మ‌కాల్ని ప్ర‌పంచ వ్యాప్తంగా న్య హైట్స్‌కి తీసుకెళ్లాల‌న్న‌దే మా ల‌క్ష్యం. ఈ విష‌యంలో ఎవ‌రు విమ‌ర్శించినా లెక్క‌చేయం. రానున్న రోజుల్లో రూ.450 కోట్ల మేర బిజినెస్ చేయాల‌న్న‌దే టార్గెట్` అని తెల‌ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ‌న్నా ఎంపిక‌లో రాజ‌కీయ కోషం లేద‌ని చెబుతున్నా.. రాజ‌కీయ కోణం ఉంద‌నే వాద‌న బ‌లంగానే వినిపిస్తోంది.