Begin typing your search above and press return to search.

నగరంలో మరో భారీ స్టూడియో..

ఈ స్టూడియోనూ అత్యున్నత సాంకేతిక గల ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ​సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్నారట

By:  Tupaki Desk   |   1 Aug 2023 9:27 AM GMT
నగరంలో మరో భారీ స్టూడియో..
X

సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శకనిర్మాతలు సినిమాలు, వెబ్​సిరీస్​లను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్​ వచ్చాక సినిమా, సిరీస్​లు ఎక్కువైపోయాయి. నిర్మాణ సంస్థలు పోటీ పడి మరీ చిత్రాలను నిర్మిస్తున్నాయి. భారీ సంఖ్యలో కొత్త కొత్త స్టూడియోలు కూడా ఏర్పాటవతున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్​ నగరంలో మరో కొత్త భారీ స్టూడియో ఏర్పాటు కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైం హోం గ్రూప్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది.

తెలంగాణలోని ప్రముఖ నిర్మాణ రంగ సంస్థల్లో మై హోం గ్రూప్​ ఒకటి. నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటోందీ సంస్థ. ఇప్పటికే ఎన్నో సేవలందించిన ఈ సంస్థ సినీ నిర్మాణరంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్​టైన్మెంట్​తో కలిసి సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడీ నిర్మాణ సంస్థ ఓ విలాసవంతమైన స్డూడియోను నిర్మించేందుకు సిద్ధమైంది.

త్వరలోనే ఈ స్టూడియోను ప్రారంభించనుంది మై హోం గ్రూప్. హైదరాబాద్​ శివార్లలో దీన్ని భారీగా నిర్మించాలని నిర్ణయించుకుంది. అందుకు కావాల్సిన పర్మిషెన్స్​ను కూడా తీసుకుందని తెలిపింది. ఈ స్టూడియోనూ అత్యున్నత సాంకేతిక గల ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్నారట. ఎవరూ ఊహించని విధంగా దీన్ని నిర్మించనున్నారని అంటున్నారు.

ఇప్పటికే అమెజాన్​, నెట్​ఫ్లిక్స్ సహా పలు దిగ్గజ సంస్థలు.. నగరంలోని స్టూడియోలను లీజ్​కు తీసుకుని సినిమా సిరీస్​లను తెరకెక్కిస్తున్నాయి. అదే విధంగా సిటీలో స్టూడియో ఎక్స్​పెన్సివ్​ కూడా ఎక్కువ అవుతోంది. అందుకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా.. వందల ఎకరాల్లో భారీ స్టూడియోను నిర్మించేందుకు మై హోం గ్రూప్ శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఇది ప్రారంభంకానుంది. మిగతా వివరాలు కూడా త్వరలోనే తెలియజేయనున్నారు.

ఇకపోతే ఇటీవలే మై హోమ్ గ్రూప్‌ ఓ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిదే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేటగిరీలో మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకుంది. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును ప్రదానం చేశారు.