Begin typing your search above and press return to search.

బాపు `వంశ‌వృక్షం` నా మొద‌టి సినిమా: అనీల్ క‌పూర్

అనిల్ కపూర్ ప్రీరిలీజ్ వేదిక‌పై మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం ఇక్క‌డే న‌టించాను. తొలి చిత్రం `వంశవృక్షం` గొప్ప ద‌ర్శ‌కులు బాపు గారి దర్శకత్వంలో చేశాను.

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:55 AM GMT
బాపు `వంశ‌వృక్షం` నా మొద‌టి సినిమా: అనీల్ క‌పూర్
X

రణ్‌బీర్ కపూర్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వ‌హించిన `యానిమల్` డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్రీరిలీజ్ వేడుక‌లో బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అనీల్ క‌పూర్ త‌న‌దైన ఎన‌ర్జీతో జోష్ ని నింపారు.

అనిల్ కపూర్ ప్రీరిలీజ్ వేదిక‌పై మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం ఇక్క‌డే న‌టించాను. తొలి చిత్రం `వంశవృక్షం` గొప్ప ద‌ర్శ‌కులు బాపు గారి దర్శకత్వంలో చేశాను. నా పునాది దక్షిణాది పరిశ్రమలోనే పడింది. ఇక్కడే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నా రెండో తెలుగు సినిమాగా యానిమల్ విడుదల కావడం ఆనందంగా వుంది. సందీప్ ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. ఈ కథని సందీప్ అద్భుతంగా రాసుకున్నాడు. అందరూ ఇందులో ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతారు. ర‌ణ‌బీర్, రష్మిక, బాబీ అందరితో కలసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చాలా చక్కని నటీనటులు ఇందులో ఉన్నారు`` అని అన్నారు.

ఇక ఇదే వేదిక వ‌ద్ద‌కు విచ్చేసిన మ‌హేష్ ని సూప‌ర్ స్టార్ వేదిక‌పైకి రావాలంటూ ఆహ్వానించిన అనీల్ క‌పూర్ మ‌హేష్ సినిమాలోని హిట్ పాట‌కు డ్యాన్సులు చేసారు. మ‌హేష్ ని స్టెప్పులేయాల‌ని అనీల్ కోరగా, మ‌హేష్ చాలా సింపుల్ గా సీనియ‌ర్ న‌టుడికి ఒక హ‌గ్ ఇచ్చారు. త‌న‌దైన శైలిలో న‌వ్వేస్తూ ఆ ఎపిసోడ్ నుంచి త‌ప్పించుకున్నారు. అనంత‌రం స్పీచ్ లో మ‌హేష్ సీనియ‌ర్ న‌టుడు అనీల్ క‌పూర్ ఛామ్ ని ఎన‌ర్జీని ప్ర‌శంసించారు. ఆయ‌న వ‌య‌సుతో సంబంధం లేకుండా ఛామ్ మెయింటెయిన్ చేస్తూ త‌న‌కు స్ఫూర్తిగా నిలిచార‌ని అన్నారు.