రేపు థియేట్రికల్ రిలీజ్.. ఎల్లుండి ఓటీటీ రిలీజ్
ఈ నేపథ్యంలోనే ఓటీటీలకు ఆదరణ బాగా పెరుగుతుంది. అందుకే ఓటీటీలు కూడా భారీ రేట్లతో సినిమాలను కొని తమ వినియోగదారులను సంతృప్తి పరుస్తున్నారు.
By: Tupaki Desk | 17 July 2025 3:41 PM ISTఒకప్పటిలా కొత్త సినిమాల కోసం ఆడియన్స్ థియేటర్లకు పరుగులు పెట్టడం బాగా తగ్గిపోయింది. అంతగా చూడాలంటే మంచి టాక్ వచ్చి సినిమా హిట్టైతే వెళ్లొచ్చులే అనుకుంటున్నారు. లేదంటే ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీలకు ఆదరణ బాగా పెరుగుతుంది. అందుకే ఓటీటీలు కూడా భారీ రేట్లతో సినిమాలను కొని తమ వినియోగదారులను సంతృప్తి పరుస్తున్నారు.
దీంతో సినిమా థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ల మీద పడుతుంది. ఈ విషయంలో అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా రోజురోజుకీ ఆ పరిస్థితులు మితిమీరుతున్నాయి. కొన్ని సినిమాలు మరీ రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో నిర్మాతలు నష్టాల బారిన పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జులై 18న రిలీజవుతున్న ఓ తమిళ డబ్బింగ్ సినిమా జులై 19 నుంచి ఓటీటీలోకి వచ్చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తమిళ సినిమా డీఎన్ఏ ను తెలుగులో మై బేబీ అనే పేరుతో జూన్ 18న రిలీజ్ చేస్తున్నారు. జూన్ 20న డీఎన్ఏ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే అందుకుంది. దీంతో ఈ సినిమాను తెలుగు డబ్ చేసి రిలీజ్ కు రెడీ చేశారు.
కానీ డబ్బింగ్ వర్క్స్ కాస్త లేటవడంతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన ఒక రోజుకే ఓటీటీ రిలీజ్ కూడా కాబోతుంది. గతంలో త్రిష నటించిన ఐడెంటిటీ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ వేదా కూడా ఇలా గంటల తేడాతోనే థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చి బాగా నష్టపోగా ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అవబోతుంది. దానికి తోడు ఈ సినిమా డబ్బింగ్ మూవీ అవడంతో మై బేబీ నిర్మాతలకు నష్టం తప్పేలా కనిపించడం లేదు.
