Begin typing your search above and press return to search.

సాంగ్ పై ట్రోల్స్.. మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ డెసిషన్!

తాజాగా యువన్.. తన ఇన్ స్టా అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారు. సెర్చ్ లో ఆయన ఐడి టైప్ చేసి వెతికినా కూడా కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   18 April 2024 11:04 AM GMT
సాంగ్ పై ట్రోల్స్.. మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ డెసిషన్!
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యువన్ శంకర్ రాజా ఒకరు. ఆయన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కుమారుడని అందరికీ తెలిసిందే. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఎన్నో సినిమాలకు యువన్ మ్యూజిక్ తో పాటు సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకున్నారు. ఇటీవల విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి కూడా సంగీతాన్ని అందించారు.

త్వరలో రిలీజ్ కానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఇప్పటికీ విడుదలైన సాంగ్స్.. క్రేజీ రెస్పాన్స్ అందుకున్నాయి. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం యువన్ శంకర్ రాజా.. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం- GOAT మూవీకి కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విజిల్ పోడు లిరికల్ సాంగ్ ను రివీల్ చేశారు మేకర్స్.

అయితే ఈ పాటకు అనుకున్న స్థాయిలో ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ నుంచి రెస్పాన్స్ రాలేదు. చాలా మంది యువన్ శంకర్ రాజాను ఫుల్ ట్రోల్ చేశారు. సాంగ్ ఏమాత్రం బాగాలేదని కామెంట్స్ పెట్టారు. కేవలం విజిల్ పదాన్ని పదే పదే యూజ్ చేశారని, సాంగ్ కు బాడ్ ట్యూన్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. అలా సోషల్ మీడియాలో రకరకాలుగా యువన్ శంకర్ రాజా పై ట్రోలింగ్ చేశారు.

తాజాగా యువన్.. తన ఇన్ స్టా అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారు. సెర్చ్ లో ఆయన ఐడి టైప్ చేసి వెతికినా కూడా కనిపించడం లేదు. విజిల్ పోడు సాంగ్ పై వచ్చిన ట్రోల్స్ వల్లే యువన్ డీయాక్టివేట్ చేశారని కొందరు చెబుతున్నారు. అయితే యువన్.. ఎక్స్ (ట్విట్టర్)లో మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేషన్ కు సంబంధించి ఇప్పటి వరకు ఆయన ఎక్కడా స్పందించలేదు.

ఇంతకుముందు అనూహ్యంగా 2014లో ఎక్స్ (ట్విట్టర్) కు దూరమయ్యారు యువన్. మళ్లీ 2015లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం యువన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గోట్ చిత్రాలతో పాటు మిస్టర్ జూ కీపర్, మారిసన్ వంటి పలు సినిమాలకు బాణీలు కడుతున్నారు. ఇక గోట్ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మరోసారి ట్రోల్స్ బారిన పడే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.