Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి​.. స్టేజ్​పైనే నోరు జారిన తమన్​

టాలీవుడ్​ స్టార్ డైరెక్టర్​ తమన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సారి బ్లాక్ బాస్టర్​ హిట్ పాటలతో ట్రెండ్ అయితే మరోసారి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ అవుతుంటారు

By:  Tupaki Desk   |   24 Oct 2023 8:20 AM GMT
భగవంత్ కేసరి​.. స్టేజ్​పైనే నోరు జారిన తమన్​
X

టాలీవుడ్​ స్టార్ డైరెక్టర్​ తమన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సారి బ్లాక్ బాస్టర్​ హిట్ పాటలతో ట్రెండ్ అయితే మరోసారి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ అవుతుంటారు. అప్పుడప్పుడు ఆయన మాట్లాడే మాటలు కూడా మరింత వైరల్ అవుతుంటాయి. తాజాగా భగవంత్ కేసరి సినిమా సక్సెస్​ మీట్​లో ఆయన చేసిన కామెంట్స్​ చర్చకు దారీ తీశాయి.

వివరాళ్లోకి వెళితే.. ఫిల్మ్​ ఇండస్ట్రీ.. ఎన్ని ప్రశంసలను ఇస్తుందో.. అన్నే విమర్శలను కూడా ఇస్తుంది. హీరోలు, దర్శకులు, హీరోయిన్స్​, మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా సినీ తారలు.. తమ ప్రొఫెషనల్​ వర్క్​ లేదా పర్సనల్​ లైఫ్​లోగానీ ఎంతటి క్రేజ్ సంపాదించుకుంటారో.. అలానే కొన్ని సందర్భాల్లో తమ బిహేవియర్​తో విమర్శలను కూడా ఎదుర్కొంటుంటారు. అందుకే ప్లేస్​ ఏదైనా ఈ తారలంతా తమ చేష్టలు - మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పబ్లిక్​ పేస్​లో.

అక్కడ ఏమాత్రం కాస్త తేడా కొట్టిన ఇక నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి​ తన మాటలతో చర్చనీయాంశంగా మారారు. "ట్విట్టర్ తెరిస్తే నా కొడుకులు ఏదేదో వాగుతున్నారు, వాళ్లకేం తెలుసంటూ" అంటూ స్టేజ్​పై సీరియస్​గా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సాధారణంమగా తమన్‌ ఎక్కువగా నెగెటివిటీని ఎదుర్కొంటారన్న సంగతి తెలిసిందే. ఆయన వర్క్‌ను తక్కువ చేస్తూ పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తుంటారు. దానిని ఉద్దేశించే తమన్​ సక్సెస్​ మీట్​లో ఇలా వ్యాఖ్యలు చేశారు. కాగా, తమన్ చేసిన కామెంట్స్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పబ్లిక్ ఫిగర్​ ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇలా ఘాటుగా మాట్లాడటం సరికాదని అంటున్నారు.

ఇకపోతే భగవంత్ కేసరికి ఆయన అందించిన మ్యూజిక్​ ప్లస్​గా నిలిచింది. బ్యాక్​ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుందని అంటున్నారు. అయితే ఆయన గత సినిమా స్కంద సినిమా విషయంలో మాత్రం నెగిటివిటీని ఎదుర్కొన్నారు. ఆ చిత్ర దర్శకుడు బోయపాటి కూడా పరోక్షంగా తమన్​పై కామెంట్స్​ చేయడం కూడా వైరల్​గా మారింది.