Begin typing your search above and press return to search.

ట్రోల్స్ కి పని చెబుతున్న థమన్

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ కి థమన్ సొంతం చేసుకున్నాడు. మెజారిటీగా స్టార్ హీరోల సినిమాలకి అతను సంగీతం అందిస్తున్నాడు

By:  Tupaki Desk   |   19 Sep 2023 3:49 AM GMT
ట్రోల్స్ కి పని చెబుతున్న థమన్
X

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ కి థమన్ సొంతం చేసుకున్నాడు. మెజారిటీగా స్టార్ హీరోల సినిమాలకి అతను సంగీతం అందిస్తున్నాడు. ఏడాదికి 10 సినిమాలకి తక్కువ కాకుండా థమన్ చేస్తున్నాడు. వీటిలో మెజారిటీగా స్టార్ హీరోల చిత్రాలే ఉండటం విశేషం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వీరసింహారెడ్డి, వారసుడు, బ్రో సినిమాలకి థమన్ సంగీతం అందించారు.

వీటిలో ఒక్క పాట కూడా గుర్తుండిపోయే విధంగా లేదనే విమర్శలు వచ్చాయి. కమర్షియల్ బీట్స్ తప్ప అల వైకుంఠపురంలో తరహాలో ఎక్కువ రోజులు వినిపించే సాంగ్స్ అయితే లేవు. రామ్ పోతినేని స్కంద మూవీకి కూడా థమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చిన ఏ ఒక్క సాంగ్ కూడా వైబ్ క్రియేట్ చేయలేదు. తాజాగా కల్ట్ మామ అంటూ ఓక ఐటెం సాంగ్ స్కంద నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ పాట కూడా మ్యూజిక్ పరంగా తేలిపోయిందనే మాట వినిపిస్తోంది. అలాగే రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి అనే ఓ సాంగ్ లీక్ అయ్యింది. ఈ సాంగ్ కూడా పెద్దగా ఆకట్టుకునేస్థాయిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంగ్స్ విషయంలో థమన్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఎక్కడో ట్యూన్స్ కాపీ చేసి తన సినిమాలకి వాడేస్తూ ఉంటాడనే విమర్శలు అతనిపైన ఉన్నాయి. వీటిపై థమన్ చాలా సార్లు వివరణ ఇచ్చారు. అయితే ఈ ఏడాదిలో థమన్ నుంచి వచ్చిన ఒక్క ఆల్బమ్ కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. తాజాగా స్కంద, గేమ్ చేంజర్ సాంగ్స్ విషయంలో కూడా తేలిపోయాడనే మాట సోషల్ మీడియా సర్కిల్ లో వినిపిస్తోంది.

దీంతో థమన్ మరోసారి ట్రోలర్స్ కి మంచి పని పెట్టాడనే మాట వినిపిస్తోంది. ఈ సాంగ్స్ పైన ట్రోలింగ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. మరి వారికి సమాధానం చెప్పాలంటే బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కచ్చితంగా ఒకటైనా థమన్ నుంచి రావాలి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాలలో సాంగ్స్ ఎప్పుడు కూడా బెస్ట్ ఉంటాయి. కాబట్టి ఈ చిత్రానికైనా బెస్ట్ ఆల్బమ్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.