Begin typing your search above and press return to search.

రూమర్స్ కి చెక్ పెట్టె పనిలో తమన్

బ్రో సినిమాతో తమన్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి మ్యూజిక్ తో మూవీని రీచ్ చేసే ప్రయత్నం చేశారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:05 AM GMT
రూమర్స్ కి చెక్ పెట్టె పనిలో తమన్
X

టాలీవుడ్ ప్రస్తుతం మోస్ట్ డిమాండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి తమన్. స్టార్ హీరోలందరతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తన వరకు అన్నింటికి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అతని చేతిలో 10 ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. వాటిలో ఏ ఏడాది రిలీజ్ అయ్యేవి కొన్ని కాగా వచ్చే ఏడాది వేసవి లోపు థియేటర్స్ లోకి వచ్చేవి కొన్ని.

బ్రో సినిమాతో తమన్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి మ్యూజిక్ తో మూవీని రీచ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో సాంగ్స్ ఫెయిల్ అయిన కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా ఉందనే మాట వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోన్న గుంటూరు కారం సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నార.

అయితే ఈ సినిమా నుంచి తమన్ ని తొలగించినట్లు పదే పదే ప్రచారం అవుతోంది. ఆరంభంలో ఇలాంటి ప్రచారం జరిగితే దానిపై తమన్ క్లారిటీ ఇచ్చారు. మరో మరోసారి తమన్ సాంగ్స్ మహేష్ బాబుకి నచ్చలేదని టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి తమన్ ఇప్పుడు సిద్ధమయ్యారంట. గుంటూరు కారం కోసం ఇప్పటికే ఒక సాంగ్ కంప్లీట్ చేసి ముంబైలో సాంగ్ మిక్సింగ్, రికార్డింగ్ చేయించుకొని హైదరాబాద్ తీసుకొచ్చారంట.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈ సాంగ్ ని వినిపించిన తర్వాత పాటని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ గా ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తే రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకి కూడా ట్రీట్ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారంట.

మహేష్ బాబు ఈ సాంగ్ ఇంకా వినలేదని తెలుస్తోంది. ఆయన విన్న వెంటనే పర్మిషన్ తీసుకొని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఇప్పటికే గుంటూరు కారం సినిమా స్టార్ట్ అయ్యి ఏడాదికి పైగా అవుతోంది. ఏవో ఆటంకాలతో మాటిమాటికి ఆగుతూ వెళ్తోంది. రీసెంట్ గా కంప్లీట్ కొత్త స్క్రిప్ట్ తో స్టార్ట్ అయిన కూడా ఎందుకనో మళ్ళీ విరామం వచ్చింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ ద్వారా ఫ్యాన్స్ ని ఉత్సాహం అందించాలని అనుకుంటున్నారంట.