Begin typing your search above and press return to search.

ఈసారైనా కమ్ బ్యాక్ ఇస్తారా మణిశర్మ?

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు మణిశర్మ.

By:  Tupaki Desk   |   1 Oct 2023 2:30 PM GMT
ఈసారైనా కమ్ బ్యాక్ ఇస్తారా మణిశర్మ?
X

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు మణిశర్మ. ఒకానొక సమయంలో ప్రతి ఏడాది డజనుకి పైగా సినిమాలు చేస్తూ ఉండేవారు. అలాగే స్టార్ హీరో సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ పేరు వినిపించేది. బ్యాగ్రౌండ్ కింగ్ అనే బ్రాండ్ ని కూడా మణిశర్మ సొంతం చేసుకున్నారు.

దేవిశ్రీ ప్రసాద్, థమన్ లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత మణిశర్మ ప్రభావం తగ్గుతూ వచ్చింది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తోన్న అతని మ్యూజిక్ తో మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయారు. వీరిద్దరూ జెట్ స్పీడ్ తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా మారిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ సెలక్టివ్ గా సినిమాలు చేస్తోన్న కూడా థమన్ మాత్రం చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారు. కమర్షియల్ స్టార్ హీరోల చిత్రాలు అన్నింటికీ అతనే మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు.

ఇక మణిశర్మ అయితే ఈ ఏడాది శాకుంతలం సినిమాకి మ్యూజిక్ అందించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అతని చేతికి వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి కూడా మణిశర్మ సంగీతం అందించారు.

అయితే డబుల్ ఇస్మార్ట్ కోసం పూరి జగన్నాథ్ వేరొక మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్తున్నారనే ప్రచారం నడిచింది. మణిశర్మతో క్రియేటివ్ డిఫరెన్స్ వలన కొత్తవాళ్లని వెతుకుతున్నారు అని టాక్ వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఇప్పటికే ఒక సాంగ్ కంపోజ్ కూడా చేసారంట. ప్రస్తుతం మిగిలిన పాటల మీట వర్క్ చేస్తున్నారంట.

పూరి జగన్నాథ్ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్లుగానే సాంగ్స్ మణిశర్మ అందిస్తున్నారనే మాట వినిపిస్తోంది. మరి ఈ చిత్రంతో అయిన మణిశర్మ కమ్ బ్యాక్ అయ్యి తన బ్రాండ్ ని రీక్రియేట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.