Begin typing your search above and press return to search.

ఇంద్ర‌జ కుమార్తె మ్యూజిక్ డైరెక్ట‌ర్ గానా?

టాలీవుడ్ లో ఇంద్ర‌జ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టిగా ఎన్నో సినిమాల్లో న‌టించిన ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ కొన‌సాగిస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Aug 2023 2:30 PM GMT
ఇంద్ర‌జ కుమార్తె మ్యూజిక్ డైరెక్ట‌ర్ గానా?
X

టాలీవుడ్ లో ఇంద్ర‌జ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టిగా ఎన్నో సినిమాల్లో న‌టించిన ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు టీవీషోలు చేస్తున్నారు. టెలివిజ‌న్ షోస్ తో ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతున్నారు. ఇక ఇంద్ర‌జ మంచి డాన్స‌ర్ కూడా. న‌టి కాక ముందే నాట్యంలో ఎంతో ఫేమ‌స్. శాస్త్రీయ నాట్యములో ఇంద్రజ చిన్న‌ప్పుడే శిక్ష‌న పొందారు. మాధ‌వ‌పెద్ది మూర్తి బృందంతో పాటు పర్యటించి విదేశాలలో సైతం ప్రదర్శనలు ఇచ్చారు.

గాయ‌నిగానూ రాణించారు. తెలుగు బ్రాహ్మ‌ణ కుటుంబంలో ఇంద్ర జ‌న్మించారు. అటుపై మ‌ద్రాసులో పెరిగారు. అలా చిన్న‌ప్పుడే సంగీతం..నాట్యంపై ప‌ట్టు సాధించారు. ఇప్పుడామె కుమార్తె సారా కూడా తల్లి బాట‌లో ప‌య‌నించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే సారాలో న‌టి క‌న్నా..మ్యూజిక్ ప్రియురాల్ని చూసిన‌ట్లు ఓ సంద‌ర్బంలో ఇంద్ర‌జ తెలిపారు. కుమార్తె పెద్ద సింగ‌ర్..మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతుంద‌ని పిస్తుంద‌న్నారు.

మ్యాక‌ప్ వేసుకోవ‌డం కంటే ఆ ర‌కంగా వెళ్ల‌డ‌మే త‌న‌కు ఇష్టం అన్న‌ట్లు స్పందించారు. తల్లి ఎలాగూ గాయ‌ని కాబ‌ట్టి సారా ఎదుగ‌ద‌ల‌కు ఉప‌యోగ ప‌డే అంశ‌మే. ప్ర‌స్తుతం సారా చ‌దువుకుంటుంది. చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత త‌న‌కిష్ట‌మైన రంగం వైపు వెళ్లేలా త‌ల్లిదండ్రులుగా త‌మ బాద్య‌త తీసుకుంటామ‌ని తెలిపారు. ఇంద్రజ భర్త పేరు మొహమ్మద్ అబ్సర్. ఈయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు.

గ‌తంలో కొన్ని సీరియళ్లలో కూడా నటించారు. ఇద్ద‌రిదీ ప్రేమ వివాహం . మ‌తాలు వేరైనా ఆ ప్రేమ‌కు మ‌తాలు..కులాలు అడ్డు కాద‌ని నిరూపించిన దంప‌తులు వీళ్లు. వీళ్ల పెళ్లి చాలా సింపుల్ గా జ‌రిగింది. ఇది అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మైంది. ఆ త‌ర్వాత అన్ని స‌ర్దుకున్నాయి. కుటుంబ విష‌యాల్ని మీడియాతో పంచుకోవడానికి ఇంద్ర‌జ ఎంతో ఆస‌క్తి చూపిస్తుంటారు. సినిమా విశేషాలు బోర్..ఫ్యామిలీ మ్యాట‌ర్స్ ఆస‌క్తిగా ఉంటాయంటారు.