అల్లరి నరేష్ సినిమాని రీమేక్ చేస్తోన్న మురగదాస్!
నరేష్ కెరీర్ లోనే మంచి యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రంగా నిలిచింది. అయితే కమర్శియల్ గా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు.
By: Tupaki Desk | 20 Jun 2025 2:00 AM ISTకోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ మురగదాస్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. ఇటీవలే బాలీవుడ్ లో 'సికిందర్' తో ప్రేక్షకుల ముందుకొచ్చినా పనవ్వలేదు. మరోసారి రోటీన్ సినిమా చేసాడనే విమర్శలు ఎదు ర్కున్నారు. సల్మాన్ ఖాన్ పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో మదరాసి అనే భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ అవుతుంది.
సెప్టెంబర్ 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో పాటు మురగదాస్ మరో రెండు చిత్రాలు కూడా పట్టాలెక్కించారు. అయితే ఈ రెండు కూడా రీమేక్ కావడం విశేషం. విక్రమ్ హీరోగా శశి గణేషన్ దర్శకత్వం వహించిన 'కాంతస్వామి' చిత్రాన్ని మురగదాస్ రీమేక్ చేస్తున్నారు. అలాగే తెలుగులో యావరేజ్ గా ఆడిన 'ఉగ్రం' చిత్రాన్ని కూడా రీమేక్ చేస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
నరేష్ కెరీర్ లోనే మంచి యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రంగా నిలిచింది. అయితే కమర్శియల్ గా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. ఇదే కథను మురగదాస్ రీమేక్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాంతస్వామి కూడా యావరేజ్ గా ఆడింది. ఇలా యావరేజ్ చిత్రాలు రెండింటిని మురగదాస్ రీమేక్ చేయడం సర్వత్రా చర్చకు దారి తీస్తుంది. ఇందులో హీరోలు ఎవరు? అన్నది తెలియదు. అలాగే ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధిం చిన విషయాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
కెరీర్ ఆరంభంలో మురగదాస్ తన చిత్రాల్ని తానే రీమేక్ చేసేవారు. కోలీవుడ్ లో తీసిన సక్సెస్ పుల్ చిత్రాలను తెలుగు , హిందీ భాషల్లో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. 'గజినీ', 'తుపాకీ' సినిమాలు అలా రీమేక్ అయినవే. ఈ రెండు కూడా యూనిక్ చిత్రాలు. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ యావరేజ్ చిత్రాలను రీమేక్ చేయడం ఇంట్రెస్టింగ్.
