శివ కార్తికేయన్ మదరాసి రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్
ఈ సినిమాకు మదరాసి అనే టైటిల్ ను ఖరారు చేయగా, మదరాసి సినిమాను మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.
By: Tupaki Desk | 12 April 2025 12:30 PMమాస్ అండ్ కమర్షియల్ సినిమాతో పాటూ సమాజానికి మెసెజ్ ఇవ్వడంలో మురుగదాస్ కు మంచి నైపుణ్యం ఉంది. మురుగదాస్ దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన సినిమా సికందర్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమాలో మంచి పాయింట్ ను చెప్పాలనుకున్నప్పటికీ దాన్ని చెప్పిన విధానం ఆడియన్స్ కు కనెక్ట్ కాలేకపోయింది.
ఎన్నో అంచనాలతో వచ్చిన సికందర్ చతికిలపడటంతో ఇప్పుడు మురగదాస్ ఫోకస్ తన నెక్ట్స్ మూవీపైకి మరల్చాడు. మురుగదాస్ తన తర్వాతి సినిమాను కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మదరాసి అనే టైటిల్ ను ఖరారు చేయగా, మదరాసి సినిమాను మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.
అయితే మదరాసి సినిమా షూటింగ్ ఆల్రెడీ 80 శాతం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. సమ్మర్ లోపు సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం మదరాసి సినిమాను సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి, ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తోంది. సప్త సాగరాలు దాటి సైడ్ ఎ, సైడ్ బి సినిమాలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న రుక్మిణి ఈ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. అయితే సికందర్ సినిమా రిజల్ట్ చూశాక మదరాసి ఎలా ఉంటుందో అని శివ కార్తికేయన్ ఫ్యాన్స్ మురుగదాస్ పై అనుమానపడుతున్నారు.
మురుగదాస్ గతంలో చేసిన గజినీ సినిమాలో హీరో పాత్ర లాగానే మదరాసి సినిమాలో హీరో పాత్రకు కూడా ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంటుందని మురుగదాస్ ఇప్పటికే వెల్లడించారు. విద్యుత్ జామ్వాల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్రాంత్, షబీర్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలోనే మదరాసి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.