Begin typing your search above and press return to search.

ఆ హీరోతో మురుగదాస్ మాస్టర్ ప్లాన్..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 11:17 AM GMT
ఆ హీరోతో మురుగదాస్ మాస్టర్ ప్లాన్..!
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు. తమిళ్ లో ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజై సూపర్ హిట్ అయ్యేవి గజిని నుంచి తన ప్రతి సినిమాతో టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న మురుగదాస్ తెలుగు స్టార్స్ చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ సినిమాలు చేశాడు. మురుగదాస్ సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అనే భావన ఉండేది కానీ ఆయన సినిమాలు రాను రాను ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన దర్బార్ నిరాశ పరిచింది. ఆ తర్వాత దళపతి విజయ్ తో సర్కార్ తీసి హిట్ అందుకున్నారు. అయినా కూడా మురుగదాస్ కి అవకాశాలు లేకుండా పోయాయి. విజయ్ తో సినిమా ప్లాన్ చేసినా అది కుదరకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. లేటెస్ట్ గా కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ తో మురుగదాస్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్నే కన్ ఫర్మ్ చేస్తూ మురుగదాస్ తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

సరదాగా ఇన్ స్టా ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసిన మురుగదాస్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు సార్ అని అడిగిన ఫాలోవర్ కి ఆన్సర్ ఇస్తూ మరో నెల ఆగండి బాస్ అని చెప్పారు. అంటే శివ కార్తికేయన్ సినిమా గురించి అప్డేట్ రాబోతుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. మురుగదాస్ డైరెక్షన్ లో శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి. మురుగదాస్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని ఆడియన్స్ కోరుతున్నారు. గజిని సినిమా తీసిన మురుగదాస్ మరోసారి అలాంటి సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. శివ కార్తికేయన్ సినిమాతో అయినా మురుగదాస్ టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ప్రిన్స్ సినిమా చేశాడు శివ కార్తికేయన్. అతను రీసెంట్ మూవీ మహావీరుడు కూడా తెలుగులో రిలీజై పర్వాలేదు అనిపించుకుంది. సో శివా కార్తికేయన్, మురుగదాస్ ఈ కాంబో కచ్చితంగా మంచి ప్రాజెక్ట్ అందిస్తారని చెప్పొచ్చు.