ట్యాలెంట్ కి ఇలా కుర్చీ వేస్తారు!
ప్రతిభావంతులకు ఇప్పుడు అవకాశాలు దక్కుతున్నాయి. కష్టం, ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడైతే? సినిమా ఛాన్సులకు మార్గం ఈజీ అవుతుంది. ఒక్క సినిమాతో హిట్ అందుకుంటే రాత్రికి రాత్రే రాత మారిపోతుందిప్పుడు.
By: Tupaki Desk | 23 July 2025 10:00 PM ISTఇండస్ట్రీలో ట్యాలెంట్ ని తొక్కేస్తున్నారు? అన్న మాట తరుచూ వినిపిస్తుంటుంది. ప్రతిభగల వారికి కాకుండా ఎలాంటి ట్యాలెంట్ లేని వారికి రిఫరెన్స్ పేరుతో అవకాశం కల్పించి నెత్తిన పెట్టుకుంటున్నారనే ఆవేదన తెరపైకి వస్తుంటుంది. అవకాశం కల్పించే ప్రోసస్ లో రకరకాల అంశాలను ప్రామాణికంగా తీసు కుంటారు? అన్న ఆరోపణ కూడా చాలా కాలంగా ఉంది. ఇప్పటికీ ఆ విధానం కొనసాగుతుంది. అయితే మునుపటి కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి? అన్నది అంతే వాస్తవం.
ప్రతిభావంతులకు ఇప్పుడు అవకాశాలు దక్కుతున్నాయి. కష్టం, ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడైతే? సినిమా ఛాన్సులకు మార్గం ఈజీ అవుతుంది. ఒక్క సినిమాతో హిట్ అందుకుంటే రాత్రికి రాత్రే రాత మారిపోతుందిప్పుడు. మురళీ ధర్ గౌడ్ అలా వెలుగులోకి వచ్చిన నటుడే. 'రంగస్థలం'తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మురళీధర్ ఇప్పుడు పుల్ బిజీగా ఉన్నాడు. 'డీజే టిల్లు','మ్యాడ్' లాంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యారు. తెలంగాణ నేపథ్యంలో డిఫరెంట్ జానర్ పాత్ర పోషించాలంటే మురళీధరగౌడ్ ఇప్పుడు దర్శకులకు ఆప్షన్ గా మారారు.
నటుడిగా ఇప్పుడతను బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీధర్ గౌడ్ ఇండస్ట్రీ ట్యాలెంట్ కి ఎలా గౌరవం ఇస్తుందన్నది రివీల్ చేసారు. ఆయన కెరీర్ ఆరంభంలో ఓ సినిమా ఆఫీస్ కు వెళ్లగానే కూర్చుని ఓ ఉన్న వ్యక్తి ఏం తెలుసు అంటే? కామెడీ చేస్తాననని చెప్పారుట. అక్కడ మురళీ ధర్ గౌడ్ పెర్పార్మెన్స్ చూసిన ఆ వ్యక్తి అప్పటి వరకూ నిలబడి ఉన్న వ్యక్తి కి వెంటనే కుర్చీ వేసి కూర్చో బెట్టారుట.
తన సినిమాలో అవకాశం కల్పిస్తానని..ఫలాని వ్యక్తిని కలవమని మరో చోటకి పంపించినట్లు గుర్తు చేసు కున్నారు గౌడ్. ఇండస్ట్రీలో ఒకరోజు కాకపోతే మరో రోజైనా ఎవరో ఒకరి రూపంలో ప్రతిభను గుర్తించే అవకాశం దక్కుతుందన్నారు. ఆ ఛాన్స్ వచ్చే వరకూ ప్రయత్నం చేయడం తప్ప మరో ఆప్షన్ లేదన్నారు. ఇదే ఏడాది రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాల్లోనూ మురళీ ధర్ గౌడ్ కామెడీ వర్కౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పెళ్లికాని ప్రసాద్', 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయ్' చిత్రాల్లోనూ నటించారు.
