Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు ముర‌గ‌దాస్ యాక్ష‌న్!

ఎట్ట‌కేల‌కు మురుగ‌దాస్ యాక్ష‌న్ షురూ అయింది. శివ కార్తికేయ‌న్ హీరోయిన్ గా ఓ సినిమా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:03 AM GMT
ఎట్ట‌కేల‌కు ముర‌గ‌దాస్ యాక్ష‌న్!
X

ఎట్ట‌కేల‌కు మురుగ‌దాస్ యాక్ష‌న్ షురూ అయింది. శివ కార్తికేయ‌న్ హీరోయిన్ గా ఓ సినిమా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల త‌ర్వాత ముర‌గ‌దాస్ కెప్టెన్ కూర్చీ ఎక్కుతున్నారు. `ద‌ర్బార్` ప్లాప్ త‌ర్వాత మురుగ‌దాస్ నుంచి సినిమా రాలేదు. మ‌ధ్య‌లో ` రాంగీ` అనే చిత్రానికి క‌థ అందించడంతో పాటు 1947 అనే సినిమాకి నిర్మాత‌గాను వ్య‌వ‌హ‌రించారు. ఈ రెండు మిన‌హా ముర‌గ‌దాస్ నుంచి మ‌రో అప్ డేట్ లేదు.

దీంతో ఆయ‌న ఒక్క‌సారిగా ద‌ర్శ‌క‌త్వానికి ఎందుకు గ్యాప్ ప్ర‌క‌టించిన‌ట్లు అంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది. ర‌జ‌నీతో చేసిన `ద‌ర్బార్` ప్లాప్ అవ్వ‌డంతో..అభిమానుల్ని నిరుత్సాహ ప‌ర‌చ‌డంతో ముర‌గ‌దాస్ ఇలా గ్యాప్ తీసుకున్నాడా? లేక స్టోరీ సిద్దం చేయ‌డానికి స‌మ‌యం అవ‌స‌ర‌మ‌ని భావించారా? అన్న‌ది తెలియ‌దు గానీ మొత్తానిని మూడేళ్ల గ్యాప్ అనంత‌రం కొత్త ఏడాదిలో మాత్రం కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలె క్కించ‌డం అభిమానులు సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మే.

ఇంత గ్యాప్ తీసుకుని చేస్తోన్న సినిమా నేప‌థ్యంలో మ‌రోసారి ముర‌గ‌దాస్ మార్క్ ఎంటర్ టైన‌ర్ అవుతుం దని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ‌ధ్య‌లో కొంత మంది తెలుగు స్టార్ల‌తోనూ సినిమాలు కమిట్ అవుతు న్నార‌నే ప్ర‌చారం సాగింది. అందులో బ‌న్నీ..చిరంజీవి పేర్లు వినిపించాయి. రీసెంట్ గానే చిరంజీ వికి ముర‌గ‌దాస్ స్టోరీ చెప్పిన‌ట్లు కూడా వైర‌ల్ అయింది. నిజానికి ముర‌గ‌దాస్ వ‌ద్ద స్టోరీ బ్యాంక్ ఉంటుంది. ముందుగానే లైన్లు సిద్దం చేసుకుని పెట్టుకుంటారు.

తాను చెప్పిన లైన్ హీరోకి న‌చ్చిందంటే డెవ‌ల‌ప్ చేస్తుంటారు. స్టోరీల విష‌యంలో ముర‌గ‌దాస్ ప్లానింగ్ చాలా ప‌క్క‌గా ఉంటుంది. ఆయ‌న ఏ సినిమా చేసినా హీరోకి లైన్ ఏడాది క్రితం వినిపించి ఉంటారు. ఈ లోపు సెట్స్ లో ఉన్న సినిమాలు షూటింగ్ పూర్తిచేస్తుంటారు. ఖాళీ స‌మ‌యంలో క‌థ మొత్తం సిద్దం చేస్తుం టారు. ముర‌గ‌దాస్ సినిమాలు చేసే ప్రాసస్ ఇలాగే ఉంటుంది. శివ కార్తీకేయ‌న్ కి కూడా చాలా కాలం క్రితం వినిపించి స్టోరీ ఇది. ఇప్ప‌టికీ ఆ కాంబోలో సాధ్య‌మైంది.