Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ మూవీ మూడో పార్ట్‌ ఉన్నట్టా? లేనట్టా?

దర్శకుడు రాజ్ కుమార్‌ హిరాని కూడా మున్నాభాయ్‌ 3 సినిమా విషయంలో ఆసక్తిగా ఉన్నట్లుగా స్వయంగా చెప్పుకొచ్చాడు. తాను త్వరలోనే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   15 May 2025 6:00 AM
సూపర్‌ హిట్‌ మూవీ మూడో పార్ట్‌ ఉన్నట్టా? లేనట్టా?
X

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ ప్రాంచైజీల్లో మున్నా భాయ్‌ ఒకటి. ఇప్పటి వరకు మున్నాభాయ్ ఎంబీబీఎస్‌, లగేరహో మున్నాభాయ్ సినిమాలు వచ్చాయి. సంజయ్‌ దత్‌ నటించిన ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ రెండు సినిమాలను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే. తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్‌, శంకర్ దాదా జిందాబాద్‌ సినిమాలతో మెగాస్టార్‌ చిరంజీవి సైతం సూపర్‌ హిట్స్‌ను సొంతం చేసుకున్న కారణంగా అన్ని భాషల్లోనూ మున్నాభాయ్ ప్రాంచైజీలో మూడో పార్ట్‌ కోసం ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఆ మధ్య మూడో సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది.

దర్శకుడు రాజ్ కుమార్‌ హిరాని కూడా మున్నాభాయ్‌ 3 సినిమా విషయంలో ఆసక్తిగా ఉన్నట్లుగా స్వయంగా చెప్పుకొచ్చాడు. తాను త్వరలోనే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ మధ్య కొన్ని రోజులు వర్క్‌ కూడా జరిగింది. కానీ తాజాగా బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పట్లో మున్నాభాయ్ 3 సినిమా ఉండక పోవచ్చు. సూపర్‌ హిట్‌ సినిమాలను రూపొందించిన రాజ్ కుమార్‌ హిరానీ కచ్చితంగా స్క్రిప్ట్‌ విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి చెందితేనే షూటింగ్‌కి వెళ్తాడు. కానీ ఇప్పటి వరకు మూడో పార్ట్‌ కోసం కథ రెడీ కాలేదని, అందుకే సినిమాను క్యాన్సల్‌ చేసే ఉద్దేశం ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రాజ్‌ కుమార్‌ హిరానీ చివరగా డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా యావరేజ్‌గానే నిలిచింది. ఆయన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. అంతే కాకుండా డంకీ సినిమా తర్వాత కొత్త సినిమా విషయంలో దర్శకుడు వెంటనే నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రాంచైజీ కథ విషయంలో దృష్టి పెట్టలేక పోతున్నాడని, అందుకే సీక్వెల్‌ విషయంలో ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాడు అంటూ సమాచారం అందుతోంది. అతి త్వరలోనే రాజ్‌ కుమార్‌ హిరానీ తన తదుపరి సినిమాను ఆమీర్ ఖాన్‌తో చేసే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన 3 ఇడియట్స్‌, పీకే సినిమాలు సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే.

విక్రాంత్‌ మాసే, విక్కీ కౌశల్‌తో ప్రస్తుతం రాజ్‌ కుమార్‌ హిరానీ వెబ్‌ సిరీస్‌ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ వెబ్‌ సిరీస్‌ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన సినిమాల మేకర్‌గా గుర్తింపు దక్కించుకున్న రాజ్‌ కుమార్‌ హిరానీ మున్నాభాయ్‌ చేస్తే కచ్చితంగా మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పెద్ద విజయాలు దక్కలేదు. అందుకే ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీ వారు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత అయినా మున్నాభాయ్‌ మూడో పార్ట్‌ వచ్చేనా అనేది చూడాలి.