శార్వరి వాఘ్.. బ్లాక్ అండ్ వైట్ లో బికినీ ఫీస్ట్..!
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోషూట్‌తో బాలీవుడ్ నటి శార్వరి వాఘ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయారు.
By: Tupaki Desk | 2 July 2025 1:28 PM ISTఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోషూట్‌తో బాలీవుడ్ నటి శార్వరి వాఘ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఈ సారిగా బికినీలో బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో స్టన్నింగ్ లుక్‌తో కనిపించిన ఆమె.. డోర్‌ఫ్రేమ్‌ను ఫిక్స్ చేసిన స్టైల్‌లో, చక్కటి పోజులతో గ్లామర్ పంజా విసిరారు. ఆమె బాడీ లాంగ్వేజ్, స్టేర్, ఫ్యాషన్ సెన్స్ అన్నీ కలసి ఈ ఫోటోలను ట్రెండింగ్‌లోకి తెచ్చేశాయి. ఈ ఫొటోలు పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే లక్షకి చేరువయ్యే లైక్స్ రావడం విశేషం.
ఇటీవల ‘ముంజ్య’ సినిమా విజయంతో శార్వరి వాఘ్ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేకర్స్ ఆమెపై పెట్టిన నమ్మకాన్ని మరింత బలపరిచేలా, తన నటనతో అదరగొట్టింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనలో కూడా శార్వరి మెరిసే టాలెంట్‌ను నిరూపించుకుంటోంది. ఈ ఫోటోషూట్‌లోనూ ఆమె గ్లామర్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్ గేమ్ కూడా ట్రెండింగ్ పాయింట్ అయింది.
అసలు శార్వరి కెరీర్ చూసుకుంటే.. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్న ఆమె.. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. ‘బంటి ఔర్ బబ్లీ 2’ సినిమా ద్వారా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, ఆమె టాలెంట్ ఇండస్ట్రీలో గమనించబడింది. ఇక ‘ముంజ్య’తో ఓ మినీ బ్లాక్ బస్టర్ అందుకోవడం, తనదైన మార్క్‌ను చూపించడం ఆమెకు టర్నింగ్ పాయింట్ గా మారింది.
తాజాగా శార్వరి యష్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న “ఆల్ఫా” అనే యాక్షన్ మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె యాక్షన్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన శార్వరి, ఈసారి మాస్ మసాలా పాత్రలో ఆకట్టుకోనున్నారు. ఇక తన మొదటి సినిమా సంజయ్ లీలా భన్సాలీతోనే స్టార్ట్ అయినా అది మధ్యలోనే ఆగిపోవడం తన కెరీర్‌కు ఒక చిన్న బ్రేక్ లాంటిదే అయినప్పటికీ, ఆమె కష్టపడి తిరిగి నిలబడ్డారు. ఇక ఈ ఫోటోస్ ద్వారా తనలోని స్టైలిష్ సైడ్‌ను రివీల్ చేసిన శార్వరి.. ఫ్యాషన్ ఫీల్డ్‌లో కూడా ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
