Begin typing your search above and press return to search.

ఏడిపించిన ముమైత్‌... 15 రోజులు కోమా

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు బిగ్‌బాస్ లో పాల్గొన్న ముమైత్‌ ఖాన్ కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీతో పాటు, బుల్లి తెరకు దూరంగా ఉంది.

By:  Tupaki Desk   |   5 May 2025 6:30 AM
Mumaith Khan Opens Up About Her Near-Death Experience
X

తెలుగు ప్రేక్షకులకు ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులు ముమైత్‌ను టీవీలో చూస్తూ ఉంటే, పదేళ్ల క్రితం వరకు ఆమె సినిమాల్లో ఏ రేంజ్‌లో సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నటించి మెప్పించిన ముమైత్‌ ఖాన్‌ కొన్ని హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ నటించడం ద్వారా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. అప్పట్లో సోషల్‌ మీడియా కాస్త తక్కువ కావడంతో సినిమా ఆఫర్లు తగ్గిన వెంటనే ఈ అమ్మడిని జనాలు మెల్లగా మరచిపోతూ వస్తున్నారు. సినిమాల్లో మాత్రమే మొన్నటి వరకు కనిపిస్తూ వచ్చిన ముమైత్‌ ఇప్పుడ టీవీల్లో ప్రముఖంగా కనిపిస్తోంది.

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు బిగ్‌బాస్ లో పాల్గొన్న ముమైత్‌ ఖాన్ కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీతో పాటు, బుల్లి తెరకు దూరంగా ఉంది. ఆమె కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచింది. కాని ఒకానొక సమయంలో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ సమయంలో ముమైత్‌ ఆరోగ్యం సరిగా లేదని తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయిన ముమైత్‌ ఖాన్‌ ఇప్పుడు బుల్లి తెర ద్వారా రీ ఎంట్రీ కి సిద్దం అయింది. ముమైత్‌ ఖాన్‌ ప్రస్తుతం ఒక డాన్స్ షో కి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఆ సమయంలో తన కెరీర్‌కి సంబంధించిన విషయాలను, తన ఇతర విషయాలను గురించి ప్రముఖంగా మాట్లాడుతూ వచ్చింది.

తాజా ఎపిసోడ్‌లో ముమైత్‌ ఖాన్ మాట్లాడుతూ తన ఆరోగ్యం పై షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. ఇంట్లో ఒక సందర్భంలో డాన్స్ చేస్తున్న సమయంలో కాలు స్లిప్‌ అయ్యి పడి పోవడంతో మొదడులోని నరాలు కట్‌ అయ్యాయి. ఆ సమయంలో బతకడమే కష్టం అన్నారట. 15 రోజుల పాటు కోమాలో ఉన్నాను. ఆ సమయంలో ఏం జరిగింది అనేది తెలియదు. పదిహేను రోజుల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చానని చెబుతూ ఉంటారు. సర్జరీ చేసిన తర్వాత కొంత మెమోరీ కూడా లాస్ అయింది. చాలా విషయాలను గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని విషయాలను గుర్తు తెచ్చుకోవడంకు చాలా కష్టపడుతూ ఉంటాను అంది.

ముమైత్‌ ఇప్పటికీ తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుందట. తన తలలో ఇప్పటికీ 9 వైర్లు ఉన్నాయని ముమైత్ చెప్పింది. చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ, నవ్వుతూ నవ్వించే ముమైత్ వెనుక ఇంత కథ ఉందా అని చాలా మంది షాక్ అవుతూ ఉన్నారు. షో లో చాలా మంది ముమైత్‌ ఆ విషయాలు చెబుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె ఏడవడం తో పాటు, అందరినీ ఏడిపించింది. ఆపరేషన్‌ తర్వాత చాలా మారినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. తన అందం కూడా చాలా తగ్గిందని, ఫిజికల్‌గా మెంటల్‌గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ముమైత్ ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలో ముమైత్‌ రీ ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. ప్రస్తుతానికి బుల్లితెరపై సందడి చేస్తూ ఉంది.