Begin typing your search above and press return to search.

ఆ రెండు చిత్రాల‌తో మ‌ల్టీస్టార‌ర్ అలెర్ట్!

స్పై యూనివ‌ర్శ్ నుంచి రిలీజ్ అయిన షారుక్ ఖాన్ 'పఠాన్' ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Jan 2024 7:23 AM GMT
ఆ రెండు చిత్రాల‌తో మ‌ల్టీస్టార‌ర్ అలెర్ట్!
X

స్పై యూనివ‌ర్శ్ నుంచి రిలీజ్ అయిన షారుక్ ఖాన్ 'పఠాన్' ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ స‌క్సెస్ తో స్పై యూనివర్స్ దేశంలోనే అగ్ర ఫ్రాంచైజీగా ప‌ఠాన్ అవతరించింది. ఒకే భాషలో 1000 కోట్లు సాధించిన మొదటి చిత్రంగా స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయం 'టైగర్ 3' - 'వార్ 2' వంటి స్పై యూనివర్స్ చిత్రాలకు మంచి క్రేజ్‌ని...బ‌జ్ ని క్రియేట్ చేసింది. కానీ 'టైగర్ 3' మాత్రం ఆ రేంజ్ స‌క్సెస్ ని న‌మోదు చేయ‌లేదు.

కేవ‌లం యావ‌రేజ్ హిట్ గానే బాక్సాఫీస్ వ‌ద్ద క‌నిపించింది. అదే ఇంపాక్ట్ హృతిక్ రోష‌న్ పైట‌ర్ పైనా ప‌డింద‌న్న‌ది ప‌చ్చి వాస్త‌వం. 'ఫైటర్' స్పై యూనివర్స్‌లో భాగం కానప్పటికీ దేశం యొక్క భద్రత ప్రమాదంలో ఉన్నట్లు.. శత్రుదేశ‌మైన పాకిస్తాన్ అంశాన్ని హైలైట్ చేయ‌డంతో మూస‌లోకి వెళ్లిన‌ట్లు క‌నిపించింది. అగ్రశ్రేణి సాంకేతిక విలువలు -భారీ బడ్జెట్ తో నిర్మాణం అయిన‌ప్ప‌టికీ 'ఫైటర్' ముందొస్తు బుకింగ్స్ ఎంత వీక్ గా ఉన్నాయో తెలిసిందే. దీంతో పైట‌ర్ పై ఒక్క‌సారిగా బ‌జ్ ప‌డిపోయింది.

తాజాగా ఇప్పుడు అంద‌రి ఆస‌క్తి 'వార్-2' పైనే ఉంది. హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే ఈ చిత్రాన్ని ఆయాన్ ముఖ‌ర్జీ సెట్స్ కి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా య‌శ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మాణం జ‌రుగుతోంది. ఆ సంస్థ స్పై యూనివ‌ర్శ్ నుంచి రిలీజ్ కాబోతున్న మ‌రో చిత్ర‌మిది. ప్ర‌త్యేకంగా ఎన్టీఆర్ ని రంగంలోకి దించి చేస్తోన్న చిత్ర‌మిది. దీంతో సినిమాపై అంచ‌నాలు అదే స్థాయిలో ఉన్నాయి.

అయితే తాజా స‌మ‌చారం ప్ర‌కారం స్క్రిప్ట్ లో కొన్ని ర‌కాల మార్పులు చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. 'టైగ‌ర్ -3'...'పైట‌ర్' లాంటి చిత్రాల ప్ర‌భావంతో 'వార్-2' పై ఆ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండాలంటే క‌థ‌లో కొన్ని ర‌కాల మార్పులు అనివార్య‌మ‌ని భావించి మేక‌ర్స్ అవ‌స‌ర‌మైన మార్పులు చేస్తున్న‌ట్లు ప్రచారం సాగు తోంది. పాకిస్తాన్ అంశాన్ని..దేశ భ‌క్తి లాంటి అంశాల్ని ట‌చ్ చేసినా వాటిని కేవ‌లం పైపైన మాత్ర‌మే చూపించడానికి ఆస్కారం ఉంద‌ని అంటున్నారు. మెయిన్ కంటెంట్ ని కొత్త కోణంలో ఆవిష్క‌రించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.