Begin typing your search above and press return to search.

99 రూపీస్ ఆఫ‌ర్ ఏపీ..టీఎస్ లో లేదే!

తెలంగాణలో112 ధ‌ర‌కు.. కేర‌ళ‌లో కొన్ని మ‌ల్టీప్లెక్స్ ల్లో 129 ధ‌ర‌కి..మ‌రికొన్ని చోట్ల 99 ధ‌ర‌కి అందుబాటులో ఉంది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 3:53 PM GMT
99 రూపీస్ ఆఫ‌ర్ ఏపీ..టీఎస్ లో లేదే!
X

మ‌ల్టీప్లెక్స్ లో ఫ్యామిలీతో సినిమా చూడాలంటే చుక్క‌లు క‌నిపిస్తాయి. పెరిగిన టికెట్ ధ‌ర‌లు..స్నాక్స్ ధ‌ర‌తో మ‌ల్టీప్లెక్స్ వైపు చూడాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితి. అయితే జాతీయ సినిమా దినోత్స‌వం సందర్భంగా 99 రూపాయ‌ల‌కే మ‌ల్టీప్లెక్స్ లు ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంటే ఆ రోజు రేపు శుక్ర‌వారం అవుతుంది. రేపు ఒక్క రోజు అన్ని మ‌ల్టీప్లెక్స్ ల్లో 99 రూపాయ‌ల‌కే టికెట్ ధ‌ర అందుబాటులో ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ఈ ఆఫ‌ర్ రేపు అందుబాటులో ఉంటుంది. కానీ ఏపీ..తెలంగాణ‌..త‌మిళ‌నాడు..కేర‌ళ రాష్ట్రాల్లో మాత్రం ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌దు. తెలంగాణలో112 ధ‌ర‌కు.. కేర‌ళ‌లో కొన్ని మ‌ల్టీప్లెక్స్ ల్లో 129 ధ‌ర‌కి..మ‌రికొన్ని చోట్ల 99 ధ‌ర‌కి అందుబాటులో ఉంది. రెగ్యుల‌ర్ పార్మాట్.. నాన్ రిక్లెయిన్ సీట్స్ కి మాత్రమే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. ఆ ర‌కంగా ఈ శుక్ర‌వారం సినిమా చూసే వెసులు బాటు ఉంది. ఈ శుక్ర‌వారం తెలుగు నుంచి దాదాపు ప‌ది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

తెలంగాణ‌లో రోజు ఉండే ధ‌ర‌తో పొలిస్తే కాస్త త‌గ్గుతుంది. అయితే ఏపీలో ఆ ప‌రిస్థితి లేదు. అన్ని చోట్లా ఒకే ర‌క‌మైన ధ‌ర‌లతో విక్ర‌యిస్తారు. ఇప్ప‌టికే జ‌వాన్..వ్యాక్సిన్ వార్.. థాంక్యూ ప‌ర్ క‌మింగ్.. మిష‌న్ రాణీగంజ్ లాంటి చిత్రాల టికెట్లు 99కే విక్ర‌యిస్తున్నారు.

వీటిలో జ‌వాన్ త‌ప్ప మిగిలిన సినిమాలేవి పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి జ‌నాల్ని థియేట‌ర్ వైపు ఆక‌ర్షించేలా చేస్తున్నారు. ఇక ఏపీలో వినోదం అంటే ఎప్పుడూ ఖ‌రీదైన అంశమే. టిక్కెట్ ధ‌ర‌లు ఎంత పెంచినా అభిమానులు ఎగ‌బ‌డి కొంటారు.

ఎలాగైనా అభిమాన హీరో సినిమా చూడాల‌నే ప్ర‌య‌త్నంలో ఏదీ లెక్క చేయ‌రు. ఈ ర‌క‌మైన రికార్డు దేశంలో ఏపీ..త‌మిళ‌నాడు త‌ర్వాత తెలంగాణ రాష్ట్రాలు ముందు వ‌రుస‌లో ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల్లో స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. థియేట‌ర్ల‌ని అభిమానులు ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు.