కథ కోసం ఖతర్నాక్ సెట్స్!
యాభైశాతం షూటింగ్ సెట్ లోనే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి. సెట్ లేనిది షూటింగ్ కి రాము ? అన్నట్లే సన్నివేశం కనిపిస్తుంది.
By: Tupaki Desk | 24 Aug 2025 9:30 AM ISTస్టార్ హీరోల చిత్రాలకు సెట్స్ అన్నవి కీలకంగా మారుతున్నాయా? సెట్ లేనిదే షూటింగ్ వద్దని హీరోలు చెబుతున్నారా? ఔట్ డోర్ కంటే ఇన్ డోర్ షూటింగ్ లకే హీరోలంతా ప్రాధాన్యత ఇస్తున్నారా? అంటే అవు ననే తెలుస్తోంది. ఈరోజుల్లో సినిమా అంటే సెట్ నిర్మాణం లేకుండా ఏ డైరెక్టర్ సినిమా చేయడం లేదు. కనీసం కోటి రూపాయల ఖర్చతోనైనా సినిమా కోసం సెట్ అన్నది తప్పని సరిగా మారింది. సన్నివేశంతో సంబంధం లేకుండా సెట్ నిర్మాణం అన్నది అనివార్యంగా మారిపోయింది. ఇక స్టార్ హీరోల సినిమాల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.
వందల కోట్లు ఖర్చు:
యాభైశాతం షూటింగ్ సెట్ లోనే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి. సెట్ లేనిది షూటింగ్ కి రాము ? అన్నట్లే సన్నివేశం కనిపిస్తుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `రాజాసాబ్` షూటింగ్ 50 శాతం సెట్ లోనే చేసారు. ఓ పెద్ద కోట లాంటి సెట్ నిర్మించి చిత్రీకరణ చేసారు. ఆ సెట్ నిర్మాణం కోసం 20 కోట్లు ఖర్చు అయింది. సెట్ నిర్మాణం పరంగా నిర్మాణ సంస్థ ఎక్కడా రాజీ పడలేదు. క్వాలిటీ ఔట్ పుట్ కోసం కోట్లు ఖర్చు చేసింది. ఇంకా అవసరం మేర చిన్న చిన్న సెట్స్ మరికొన్ని నిర్మించారు.
రామోజీ ఫిలిం సిటీ అడ్డాగా:
అలాగే `పౌజీ` కోసం కూడా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సెట్లు వేసి చిత్రీకరించారు. మరో పాన్ ఇండియా చిత్రం `డ్రాగన్` కోసం ప్రశాంత్ నీల్ ఓ సెట్ వేయించారు. దీని కోసం 15 కోట్లు ఖర్చుచేసినట్లు సమా చారం. అందులో ఎన్టీఆర్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న `పెద్ది` కోసం కూడా దర్శకుడు బుచ్చిబాబు భారీగానే సెట్లు వేయిం చారు. ఏకంగా సెట్ రూపంలో ఓ పల్లెటూరినే నిర్మించాడు. అందుకోసం 20 కోట్లకు పైగా వెచ్చించారు.
ఆ రెండు చిత్రాలతోనే ఆయన:
మరోవైపు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం రాజమౌళి భారీ వారణాసి సెట్ నే వేయిస్తున్నారు. ఈ సెట్ కోసం 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే సెట్లు తప్పని సరి. వాటి కోసమే వందల కోట్లు ఖర్చు చేస్తుంటారు. సెట్ పరంగా ఆయన విజన్ ఎలా ఉటుం దన్నది `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` చిత్రాలతో ప్రూవ్ అయిందే. అలాగే నటసింహ బాలకృష్ణ నటిస్తో న్న `అఖండ 2` కోసం కూడా రామోజీ ఫిలిం సిటీలో కొన్నిసెట్లు వేసారు. వాటిలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
సెట్లు కీలకం:
ఇంకా చిరంజీవి నటిస్తోన్న `విశ్వంభర` కోసం కూడా అతిభారి సెట్లే వేసారు. సెట్ రూపంలో ఓ కొత్త ప్రపంచాన్నే దర్శకుడు వశిష్ట సృష్టించాడు. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. ఇంకా ఆన్ సెట్స్ లో ఉన్న చాలా సినిమాలు కథానుగుణంగా సెట్లు నిర్మించి చేస్తున్నారు. సెట్ లేకుండా ఏ హీరో సినిమా కూడా సెట్స్ కు వెళ్లడం లేదు. స్టార్ హీరోల నుంచి టర్ 2, టైర్ 3 హీరోలకు సెట్లు కీలకంగా మారాయి.
