Begin typing your search above and press return to search.

సోద‌రుడి మ‌ర‌ణంపై టాలీవుడ్ విల‌న్ క్లారిటీ

తెలుగు, హిందీ చిత్ర‌సీమ‌లో విల‌న్ గా న‌టించిన ప్ర‌ముఖ‌ న‌టుడు ముకుల్ దేవ్ (54) మ‌ర‌ణ వార్త ఈ ఉద‌యం మీడియా వార్త‌ల్లో నిలిచిన‌ సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 May 2025 3:03 PM
సోద‌రుడి మ‌ర‌ణంపై టాలీవుడ్ విల‌న్ క్లారిటీ
X

తెలుగు, హిందీ చిత్ర‌సీమ‌లో విల‌న్ గా న‌టించిన ప్ర‌ముఖ‌ న‌టుడు ముకుల్ దేవ్ (54) మ‌ర‌ణ వార్త ఈ ఉద‌యం మీడియా వార్త‌ల్లో నిలిచిన‌ సంగ‌తి తెలిసిందే. అత‌డి మ‌ర‌ణానికి కార‌ణాలేమిటో వెల్ల‌డి కాలేదు. అయితే ముకుల్ దేవ్ ప్ర‌ముఖ న‌టుడు రాహుల్ దేవ్ కి సోద‌రుడు అనే విష‌యం కొద్దిమందికే తెలుసు. తాజాగా రాహుల్ దేవ్ త‌న సోద‌రుడి మ‌ర‌ణం గురించి అధికారికంగా వెల్ల‌డించారు.

శుక్రవారం రాత్రి ఢిల్లీలో మరణించిన తన సోదరుడు ముకుల్ దేవ్ (54) అంత్య‌క్రియ‌ల‌ గురించి, ఆయ‌న అన్న‌య్య రాహుల్ దేవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరణానికి గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు కానీ, గత కొన్ని రోజులుగా ముకుల్ అనారోగ్యంతో ఉన్నారని, 8-10 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారని, నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించిందని మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి.

ప్రకటనలో రాహుల్ దేవ్ ఇలా రాసారు. ``మా సోదరుడు ముకుల్ దేవ్ నిన్న రాత్రి న్యూఢిల్లీలో ప్రశాంతంగా కన్నుమూశారు... ఆయన తన కుమార్తె సియా దేవ్, సోదరి రష్మి కౌశల్, సోదరుడు రాహుల్ దేవ్, మేనల్లుడు సిద్ధాంత్ దేవ్‌లను విడిచిపెట్టారు`` అని రాసారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరిగే ముకుల్ దేవ్ అంత్యక్రియలకు రాహుల్ దేవ్ అందరినీ ఆహ్వానించారు.

రాహుల్ దేవ్ టాలీవుడ్ లో పాపుల‌ర్ విల‌న్. ట‌క్క‌రి దొంగ‌, సీత‌య్య‌, సింహాద్రి, న‌ర‌సింహుడు స‌హా చాలా సినిమాల్లో నటించాడు. నాగార్జున - మాస్ లోను విల‌న్ గా అత‌డి పెర్ఫామెన్స్‌కి మంచి పేరొచ్చింది. ముకుల్ దేవ్ ఏక్ నిరంజ‌న్, కృష్ణ‌, అదుర్స్, భాయ్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించాడు.

.