విలన్ ముకుల్ దేవ్ మరణం వెనక
బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి అటుపై టాలీవుడ్ లో నటించాడు ముకుల్ దేవ్. ఇక్కడ విలన్ పాత్రలతో మెప్పించాడు.
By: Tupaki Desk | 17 Jun 2025 5:30 AMబాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి అటుపై టాలీవుడ్ లో నటించాడు ముకుల్ దేవ్. ఇక్కడ విలన్ పాత్రలతో మెప్పించాడు. అయితే అతడు ప్రముఖ విలన్ రాహుల్ దేవ్ కి సోదరుడు అనే విషయం కొద్దిమందికే తెలుసు. ఇటీవల ముకుల్ దేవ్ ఆస్పత్రి ఐసీయులో చికిత్స పొందుతూ మరణించారు. అయితే అతడి మరణంపై రకరకాల పుకార్లు షికార్ చేసాయి.
వాటన్నిటినీ ఖండించారు అతడి సోదరుడు రాహుల్ దేవ్. ముకుల్ దేవ్ చివరి రోజుల్లో చాలా కుంగుబాటుకు లోనై తిండి మానేయడం వల్ల మరణించాడని రాహుల్ దేవ్ అన్నారు. అతడి గురించి సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. తల్లిదండ్రులు మరణించాక ముకుల్ ఒంటరివాడయ్యాడు. భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇవన్నీ అతడు కుంగిపోవడానికి కారణాలు. ఒంటరితనం.. కుంగుబాటు కారణంగా సరిగా తినేవాడు కాదు. ఇదే విషయాన్ని ఆస్పత్రిలో చికిత్స చేసిన వైద్యులు కూడా చెప్పారని రాహుల్ దేవ్ వెల్లడించారు.
అడికి జీవితంపై ఆసక్తి తగ్గిపోయిందని కూడా రాహుల్ దేవ్ వెల్లడించారు. ఆస్పత్రిలో చేరే ముందు నాలుగైదు రోజుల పాటు పూర్తిగా తినడం మానేసాడని కూడా రాహుల్ దేవ్ చెప్పారు. ఒంటరితనం కారణంగా జీవితంపై ఆసక్తిని కోల్పోయాడు… చాలా అవకాశాలొచ్చినా తిరస్కరించాడు.. నిజాలు కఠినంగా ఉంటాయి.. అని అన్నారు.
అతడి గురించి తప్పుగా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరూ ఏవిధంగాను అతడికి దగ్గరగా లేరు. అతను ఫిట్‌గా లేడని వారు అంటున్నారు.. కానీ అతడు హాఫ్ మారథాన్‌లు పరిగెత్తాడు. కానీ చివరి రోజుల్లో బరువు పెరిగాడు. ఎవరైనా తమ గురించి తాము పట్టించుకోవడం మానేసినప్పుడు బరువు పెరగడం సహజం అని అన్నారు. యమ్లా పగ్లా దీవానా, ఆర్...రాజ్‌కుమార్, సన్ ఆఫ్ సర్దార్ వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ 54 సంవత్సరాల వయసులో మరణించారు. రవితేజ కృష్ణ సినిమాలో నటించాడు.