Begin typing your search above and press return to search.

వేడుక ఆద్యంతం ముఖేష్ అంబానీ క‌న్నీటిప‌ర్యంతం

ముఖ్యంగా మూడు రోజుల ఈవెంట్లో త‌న‌కు కాబోయే భార్య రాధిక‌ను అనంత్ అంబానీ ముద్దాడిన వైనం, ప్రేమ‌తో ఆలింగ‌నం చేసుకున్న తీరు అహూతుల్లో ఎమోష‌న్ ని నింపింది.

By:  Tupaki Desk   |   6 March 2024 5:15 PM GMT
వేడుక ఆద్యంతం ముఖేష్ అంబానీ క‌న్నీటిప‌ర్యంతం
X

ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ ఏడాది జూలైలో జ‌ర‌గ‌నుంది. త‌న స్నేహితురాలు రాధిక మర్చంట్ ని అనంత్ వివాహ‌మాడుతున్నారు. అంత‌కుముందే జామ్ న‌గ‌ర్‌లో మూడు రోజుల పాటు జరిగిన ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌లో రాధిక‌పై అనంత్ అంబానీ అంతులేని ప్రేమ.. ముఖేష్ అంబానీ ఎమోష‌న‌ల్ మూవ్ మెంట్స్.. ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వచ్చాయి.

ముఖ్యంగా మూడు రోజుల ఈవెంట్లో త‌న‌కు కాబోయే భార్య రాధిక‌ను అనంత్ అంబానీ ముద్దాడిన వైనం, ప్రేమ‌తో ఆలింగ‌నం చేసుకున్న తీరు అహూతుల్లో ఎమోష‌న్ ని నింపింది. ముఖ్యంగా అనంత్ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ అందరినీ ఆక‌ట్టుకుంది. చాలా మంది నెటిజ‌నులు అనంత్ అంబానీ అనారోగ్య స‌మ‌స్య గురించి తెలుసుకోకుండా అత‌డి అధిక బ‌రువు (ఒబేసిటీ) గురించి ఇష్టానుసారం కామెంట్లు చేసారు. త‌న‌కు ఆస్త్మా ఉంద‌ని, దాంతో స్టెరాయిడ్లు వాడ‌టంతో ఒబేసిటీ తీవ్ర‌త‌రం అయింద‌ని అనంత్ అంబానీ ఈ వేదిక‌పై స్ప‌ష్ఠంగా తెలిపాడు. దాని గురించి అతడు ప్రీవెడ్డింగ్ వేడుక‌ల్లో మాట్లాడుతుంటే, ముఖేష్ అంబానీ క‌ళ్ల‌నీళ్ల ప‌ర్యంతం అయ్యారు. కొడుకు క‌ష్టాన్ని త‌లుచుకుని ఆసియాలోనే బిగ్గెస్ట్ బిజినెస్ మేన్ కంట‌త‌డి పెడుతుంటే అహూతుల క‌ళ్ల‌లోను నీళ్లు తిరిగాయి.

ఇదే ఈవెంట్లో రాధికా మర్చంట్ నుదుటిపై అనంత్ అంబానీ మృధువుగా ముద్దుపెట్టిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. గోవిందో గోపాల హ‌రి గోపాల బోలో అంటూ సాగే ఆహ్లాద‌క‌ర‌మైన థీమ్ సాంగ్ ని ఈ వీడియోకి జోడించ‌డం ఆక‌ట్టుకుంది. త‌న‌కు కాబోయే భార్య రాధిక‌ను అనంత్ అంబానీ ద‌గ్గ‌ర‌కు తీసుకుని హత్తుకోవ‌డమే కాకుండా, నుదుటిపై గోముగా ముద్దాడుతూ ఎంతో ప్రేమ‌గా ఎమోష‌న‌ల్ గా క‌నిపించాడు. ఆ స‌మ‌యంలో రాధిక కంట కూడా ఆనంద భాష్పాలు క‌నిపించాయి. కొత్త జంట న‌డుమ‌ అంతులేని ప్రేమానురాగాలు ఆరాధ‌న క‌నిపించాయి. ఈ ప్రేమ‌లో స్వ‌చ్ఛ‌త నిజ‌యితీ ఆకర్షించాయి. ముఖ్యంగా త‌న కొడుకు అనారోగ్య క‌ష్టాల‌ను ద‌గ్గ‌రుండి చూసిన ముఖేష్ అంబానీ ఈ ఆనంద క్ష‌ణాల్లో ఎంతో ఉద్వేగానికి లోన‌య్యారు. కొడుకు కొత్త జీవితంలో అడుగుపెడుతున్న ఆనందం ఆయ‌న ముఖంలో ప్ర‌స్ఫుటం అయింది.

ప్రీవెడ్డింగ్ కోసం అంబానీలు 1000 కోట్లు ఖ‌ర్చు చేసారు. విదేశీ వ్యాపార‌ దిగ్గ‌జాలు, బాలీవుడ్ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, పారిశ్రామిక‌వేత్త‌లు వేడుక‌కు హాజ‌ర‌య్యారు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, సుహానా ఖాన్, అబ్రామ్, ఆర్యన్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మరియు హాలీవుడ్ సింగర్ రిహన్న నుండి జాన్వీ కపూర్, శిఖర్ పహారియా, గాయకులు అరిజిత్ సింగ్, ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్, ఇంకా పలువురు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. గతేడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న రాధిక, అనంత్‌లు 2024 జూలైలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.