మహేష్ ఫ్యాన్స్‌కి బిగ్ గుడ్ న్యూస్..!
అంటే సినిమా కచ్చితంగా 2026 చివర్లో లేదా 2027 లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 26 March 2025 12:35 PMమహేష్ బాబు గత ఏడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో సినిమా షూటింగ్‌కి జాయిన్ అయ్యాడు. హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసిన రాజమౌళి ఇటీవలే ఒడిశాలో రెండో షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాను రాజమౌళి ఎప్పుడు విడుదల చేసేది క్లారిటీ లేదు. కానీ రాజమౌళి గత సినిమాలకు తీసుకున్న టైమ్‌ను చూస్తే మహేష్ బాబు సినిమాకు కూడా కనీసం రెండేళ్లు మేకింగ్‌కు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే సినిమా కచ్చితంగా 2026 చివర్లో లేదా 2027 లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గ్యాప్ లో మహేష్ బాబు పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అంతే కాకుండా మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా : ది లయన్ కింగ్ సినిమాను ఆస్వాదిస్తున్నారు. మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ముఫాసా సినిమాకు తెలుగులో మహేష్ బాబు క్రేజ్ కారణంగా మంచి స్పందన దక్కింది. భారీ వసూళ్లు సాధించిన సినిమాగా ముఫాసా హాలీవుడ్ సినిమాల సరసన నిలిచింది.
థియేట్రికల్ రిలీజ్‌లో హిట్ అయిన ముఫాసాను ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముఫాసా సినిమాను ఎట్టకేలకు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమాను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచారు. తెలుగులో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన వర్షన్‌ను సైతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్న నేపథ్యంలో అత్యధిక వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ముఫాసా : ది లయన్ కింగ్‌కి బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి.
బారీ జెంక్సిన్ దర్శకత్వం వహించిన ఈ యానిమేషన్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు రాబట్టింది. విడుదలైన మూడు నెలలుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రాబడుతూనే ఉంది. తెలుగులో ఈ సినిమాకు మహేష్ బాబు మాత్రమే కాకుండా బ్రహ్మానందం, అలీ, సత్యదేవ్, అయ్యప్ప శర్మ వంటి ప్రముఖులు సైతం డబ్బింగ్ చెప్పారు. అందుకే తెలుగు సినిమా స్థాయిలో ఈ సినిమాకు క్రేజ్ ఉంది.