అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. తల్లి కొడుకుల బంధాన్ని తెలిపే ఓ హార్ట్ టచింగ్ సాంగ్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 9 April 2025 9:56 PM ISTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్, పోస్టర్లు ఈ చిత్రంపై అంచనాలను పెంచాయి. ఇప్పుడు తాజా అప్డేట్‌గా, మేకర్స్ రెండో సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట టైటిల్ “ముచ్చటగా బంధాలే” కాగా, ఇది తల్లి కొడుకుల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధాన్ని హృదయాన్ని తాకేలా చూపించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ సాంగ్‌ను చిత్తూరు శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో విడుదల చేశారు. విజయశాంతి, కళ్యాణ్‌రామ్ మఫ్యాలో వచ్చే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తల్లి కొడుకు కలిసి హాయిగా గడిపే నిమిషాలను చూపించడం ఓ కొత్త ఫీల్‌ను అందించింది. విజయశాంతి కుమారుడిని ఎంతో ఆప్యాయంగా చూపిస్తున్న మూమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే షూటింగ్ లొకేషన్స్ మూమెంట్స్ ను హైలెట్ చేశారు.
ఈ పాటను ప్రముఖ గాయకుడు హరిచరణ్ ఆలపించగా, రఘురామ్ రాశిన సాహిత్యం శ్రోతల మనసులను తాకేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ట్యూన్ కలిపిన ఈ పాటలో భావోద్వేగాలు నిండిన నేపథ్యం, హృదయాన్ని దోచే మెలోడీ కలిపి, వినటానికి ఎంతో తీయగా ఉంది. ‘కాంతార’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అజనీష్ ఈ సినిమాకు ప్రత్యేకంగా పని చేస్తున్నాడు.
ఈ సినిమాలో విజయశాంతి, కళ్యాణ్‌రామ్ తల్లి కొడుకులుగా నటించడం చిత్రానికి ప్రధాన బలంగా మారింది. అర్జున్ అనే యువకుడు జీవిత ప్రయాణంలో తల్లి తోడు ఎలా మారుతుందన్న దానిపై కథ సాగనుందని తెలుస్తోంది. రెండో పాట విడుదలవటంతో సినిమా సెంటిమెంట్ కోణం స్పష్టమవుతోంది. విజువల్స్‌లో వచ్చిన ఎమోషనల్ టచ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బాలుసు నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, సోహెల్ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు కెమెరామెన్ రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు. ఇక ఏప్రిల్ 18న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రెండో పాటతో పాటు కథ, క్యాస్టింగ్, ఎమోషన్ అన్నీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగిస్తున్నాయి. తల్లి కొడుకు సెంటిమెంట్‌కు అభిమానులు ఎల్లప్పుడూ రెస్పాండ్ అవుతారు. దీంత ఈ సినిమా కూడా అలాంటి భావోద్వేగాలను వేదికగా చేసుకుని మంచి హిట్ అందుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి.మ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
