Begin typing your search above and press return to search.

శెట్టి.. పొలిశెట్టి.. ఆ రెండింటిలో ఒకటి ఫిక్స్!

ఆగస్టు 18 తేదీ లేదా 20వ తేదీలపై ఫోకస్ చేసినట్లు టాక్ అయితే వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   4 Aug 2023 12:30 AM GMT
శెట్టి.. పొలిశెట్టి.. ఆ రెండింటిలో ఒకటి ఫిక్స్!
X

జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న నవీన్ పోలిశెట్టికి ఆ తర్వాత ఎన్నో రకాల ఆఫర్స్ అయితే వచ్చాయి. అయితే అతను ఎక్కడా కూడా తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలతోనే రావాలి అని ఫిక్స్ అయ్యాడు. మధ్యలో దిల్ రాజు కూడా అతనికి ఒక ఆఫర్ చేసినప్పటికీ కూడా టెంప్ట్ కాలేదు.

ఇక యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన ఆఫర్ కు మాత్రం అతను ఎంతో నమ్మకంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. పి మహేష్ బాబు దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను మంచి నిర్మాణం విలువలతోనే నిర్మించింది. కానీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం నిర్మాణ సంస్థ మరోసారి దారుణంగా ఫెయిల్ అవుతూనే ఉంది.

ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అసలు అయితే ఆగస్టు మొదటి వారంలోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ముందుగానే హీరో నవీన్ పోలిశెట్టి కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ఇక మొత్తానికి ఇప్పుడు నిర్మాతలు రిలీజ్ డేట్స్ విషయంలో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 18 తేదీ లేదా 20వ తేదీలపై ఫోకస్ చేసినట్లు టాక్ అయితే వినిపిస్తోంది. ఈ రెండిటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ అయితే పర్వాలేదు అనే విధంగా ఆకట్టుకుంది.

కానీ సాంగ్స్ మాత్రం అంతగా క్లిక్ కాలేదు. ఎటు తిరిగి ఈ సినిమాకు ఇంకా ప్రమోషన్స్ అయితే బాగానే చేయాల్సి ఉంది. నవీన్ పోలిశెట్టి ఎలాగో ఆ బాధ్యతలను తీసుకుంటాడు. ఇక అనుష్క చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపిస్తోంది కాబట్టి ఆమె నుంచి కూడా ఎంతో కొంత ప్రమోషన్ చేస్తే సినిమాకు చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మొత్తానికి యూవీ క్రియేషన్స్ మాత్రమే రిలీజ్ డేట్ విషయంలో ఎదో ఒక క్లారిటీ ఇస్తే సినిమాపై కొంత హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేయవచ్చు. మరి వాళ్ళు ఎప్పుడు అప్డేట్ ఇస్తారో చూడాలి.