Begin typing your search above and press return to search.

భార్య భ‌ర్త‌ల మ‌ధ్య పాత బైకుల పంచాయ‌తీ!

ధోనీ-సాక్షి ధాంప‌త్య జీవితం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రేమ వివాహం అనంత‌రం ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 5:00 AM IST
భార్య భ‌ర్త‌ల మ‌ధ్య పాత బైకుల పంచాయ‌తీ!
X

ధోనీ-సాక్షి ధాంప‌త్య జీవితం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రేమ వివాహం అనంత‌రం ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చినా? ఐపీఎల్ లో మాత్రం మెరుస్తున్నాడు. బిజినెస్ మ్యాచ్ లు కావ‌డంతో కొన‌సాగుతున్నాడు. మ‌రికొంత కాలం ధోనీని ఐపీఎల్ లో చూడొ చ్చు. ఇక సాక్షి వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. అప్పుడ‌ప్పుడు గ్యాల‌రీలో మెరుస్తుంటారు.

సాక్షిఅంత యాక్టివ్ గా క‌నిపించ‌రు. ఓ సాధార‌ణ మ‌హిళ‌లా మ్యాచ్ ను ఆస్వాదిస్తుంటారు. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే? ఓ ఇంట‌ర్వ్యూలో సాక్షి ధోని గురించి కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకున్నారు. `ధోనీ చిన్న‌ప్పుడు వాళ్ల నాన్న‌కు బాగా బ‌య‌ప‌డేవాడు. దీంతో ఆయ‌న‌తో స‌ర‌దాగా గ‌డ‌ప‌డాన్ని ఓ లోటుగా భావిస్తుంటాడు. అందుకే మా పాప జీవాతో స్కూల్ మాన్పించి మ‌రీ ఆడుకుంటాడు.

గోడలెక్క‌డం..చెట్టు ఎక్క‌డం.. బైక్ పై రైడింగ్ కి వెళ్ల‌డం వంటివి ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. త‌రుచూ బైకులు కొంటుంటాడు. గ్యారేజీలోనే అర్ద‌రాత్రి దాకా ఉంటాడు. ఎందుకు మ‌హీ ఇన్ని బైకులు వృద్ధాగా పోవ‌డం త‌ప్ప అంటాను. దానికి అత‌డు నేను ఇష్టంగా కొనేవి ఇవి మాత్ర‌మే క‌దా? అంటుంటాడు. ఇద్ద‌రికీ ఈ విష‌యంలో వాద‌న జ‌రుగుతుంది. ఈ విష‌యంలో ఒక‌రి మాట ఒక‌రు వినం. నేను కొన‌దొద్దు అంటాను.

ఆయన కొంటూనే ఉంటాడు. ఈ విష‌యంలో పంచాయితీలు జ‌రిగినా? అవి అక్క‌డికే ప‌రిమితం. ఎలాంటి వివాద‌మైనా ఆ కాసేపే ఉంటుంది. గంట రెండు గంట‌ల్లో మ‌ళ్లీ మామూలుగా మాట్లాడుకుంటాం. ఈ విష యంలో ఇద్ద‌రుం చాలా బ్యాలెన్స్ గా ఉంటాం. అందుకే అవ‌న్నీ స‌ర‌దాగా మారిపోతుంటాయి` అని తెలిపింది.