Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ తో ఆ ప్రయోగం...!

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

By:  Tupaki Desk   |   21 March 2024 6:41 AM GMT
ఫ్యామిలీ స్టార్ తో ఆ ప్రయోగం...!
X

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవలే చిత్రీకరణ ముగిసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్‌ రాజు అండ్ టీం ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం దర్శకుడు పరశురామ్‌ పట్టుబట్టి మరీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో సొంత డబ్బింగ్‌ చెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పాత్ర డిమాండ్‌ మేరకు ఆమె డబ్బింగ్ చెప్తేనే బాగుంటుంది అంటూ దర్శకుడు భావిస్తున్నాడట. నిర్మాత దిల్ రాజు కూడా దర్శకుడితో ఏకీభవించడం.. ఇప్పటికే డబ్బింగ్‌ కు సంబంధించిన వర్క్ జరుగుతున్నట్లుగా యూనిట్‌ సభ్యుల పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా పై హీరో హీరోయిన్ ఇద్దరు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. సీతారామం మరియు హాయ్ నాన్న ల తర్వాత మృణాల్ నుంచి రాబోతున్న మరో సినిమా ఇదే అనే విషయం తెల్సిందే. మరి దీంతో మృణాల్‌ హ్యాట్రిక్ కొట్టేనా చూడాలి.

తన మొదటి రెండు సినిమాలకు కూడా అద్దె గొంతు పై ఆధార పడ్డ మృణాల్ ఈసారి సొంత గొంతు తో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. మరి ఈ గొంతు ఎంత వరకు వర్కౌట్ అయ్యేను అనేది అందరి లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడో సినిమాతోనే సొంత డబ్బింగ్ కు ఓకే చెప్పడం గొప్ప విషయం.