మృణాల్ మేడమ్.. ఎంత ఘాటు గ్లామరో..
మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది.
By: Tupaki Desk | 19 March 2024 3:28 PM ISTమృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది. ఆ మూవీలో సీతగా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. రెండో తెలుగు సినిమా హాయ్ నాన్నతో కూడా అలరించింది. నాని సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తోంది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్నట్లు సమాచారం. టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లో కూడా బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్. స్టార్ హీరోలతో ఆడిపాడుతోంది.
అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అలరిస్తోంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫిక్స్ షేర్ చేస్తూ షేక్ చేస్తుంటుంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో ఫోటోలు దిగుతూ సెగలు పుట్టిస్తోంది. సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించే ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో వేరే లెవల్ లో చేస్తోంది. అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ వరుస పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. నెక్స్ట్ లెవెల్ లో ఉంటున్న గ్లామర్ షోకు అల్లాడిపోతున్నారు. తాజాగా ఆమె స్పెషల్ పిక్స్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఓ కారులో గ్రీన్ కలర్ షూట్ లో ఉన్న ఈ అమ్మడు తన అందంతో ఫిదా చేస్తోంది. మరో పిక్ లో తన కొంటె చూపుతో అల్లాడిస్తోంది.
ప్రస్తుతం మృణాల్ పిక్స్ ను ఫుల్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అందమంటే నీదే అమ్మడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. సో గ్లామరస్ అంటూ బ్యూటీని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. నీ అందం బౌండరీలు దాటేసిందని చెబుతున్నారు. మరిన్ని సినిమాలు చేస్తూ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారాలని ఆశిస్తున్నారు. వెయిటింగ్ ఫర్ న్యూ మూవీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సీత.. ఎలాంటి హిట్లు కొడుతుందో చూడాలి.
