Begin typing your search above and press return to search.

మీడియాలో ప‌నిచేస్తానంటోన్న హీరోయిన్!

దీంతో వెంట‌నే బ్యాచిల‌ర్స్ ఆఫ్ మాస్ క‌మ్యునికేష‌న్స్ లో చేరాను. అప్పుడే మోడ‌లింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   17 March 2024 7:16 AM GMT
మీడియాలో ప‌నిచేస్తానంటోన్న హీరోయిన్!
X

వెండితెర సీత‌మ్మ‌గా వెలిగిపోతున్న మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. టీవీసీరియ‌ల్స్ నుంచి హీరోయిన్ గా ప్ర‌మోట్ అయి నేచుర‌ల్ పెర్పార్మెన్స్ తో ప్రేక్ష‌కుకు ద‌గ్గ‌రైన న‌టి. ప్ర‌యా ణం బాలీవుడ్ లో మొద‌లు పెట్టినా..టాలీవుడ్ లో అంత‌కు మించి పేరు తెచ్చుకుంది. సీత పాత్ర‌తో ఎన‌లేని గుర్తింపును ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత అమ్మ‌డు ఎంపిక చేసుకుంటోన్న పాత్ర‌లు..న‌ట‌న ప్ర‌తీది ఆమె స్థాయిని అంత‌కంత‌కు పైకి లేపింది. ఇంత‌వ‌ర‌కూ మృణాల్ గురించి అందిరికీ తెలిసిన విష‌యం.

కానీ ఆమె సీరియ‌ళ్ల కంటే ముందుగా..న‌టిగా కంటే ముందుగా ఆమె ఇష్ట‌ప‌డిన రంగం ఒక‌టుంది. అదే మీడియా . ఆ సంగ‌తేంటో ఆమె మాట‌ల్లోనే.. నాన్న న‌న్ను బాగా చ‌దివించాల‌నుకున్నారు. డెంటిస్ట్ అవ్వాల‌ని నేను అనుకున్నాను. బీడీఎస్ రాస్తే మంచి ర్యాంక్ కూడా వ‌చ్చింది. తీరా కోర్సులో చేరే స‌మ‌యానికి నా ఆలోచ‌న మారిపోయింది. అప్ప‌టిక‌ప్పుడు మీడియా రంగంలోకి వెళ్లాల‌ని మ‌న‌సుకు బ‌లంగా అనిపించింది.

దీంతో వెంట‌నే బ్యాచిల‌ర్స్ ఆఫ్ మాస్ క‌మ్యునికేష‌న్స్ లో చేరాను. అప్పుడే మోడ‌లింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. చ‌దువును వ‌దిలిపెట్ట‌కుండానే మోడ‌లింగ్ చేసాను. క్ర‌మంగా సీరియ‌ళ్ల‌లోనూ ఛాన్సులు వ‌చ్చాయి. అయినా చ‌దువును అశ్రద్ద చేయ‌లేదు. సినిమాల్లో న‌టిస్తూ ఓ సంస్థ‌లో ఇంటెర్న్ షిప్ కూడా చేసా. ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నానేమె గానీ.. ఎప్ప‌టికైనా ఓ పేరున్న మీడియా సంస్థ‌లో ప‌నిచేయాల నుకుంటున్నా.

ఆ ర‌కంగా నేను చదివిన చ‌దువుకు న్యాయం చేసిన‌దాన్ని అవుతాను. అందులో నేనింకా నేర్చుకోవాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయి' అని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం మృణాల్ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలిసిదే. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న 'ఫ్యామిలీ స్టార్' లో న‌టిస్తోంది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. హిందీలో పూజా మేరి జాన్ అనే చిత్రంలో న‌టిస్తోంది.