Begin typing your search above and press return to search.

మాన‌వ అక్ర‌మ ర‌వాణాపై UNలో మృణాల్ స్పీచ్

'లవ్ సోనియా'లో మృణాల్ న‌టించినందున మాన‌వ‌ అక్రమ రవాణా బాధితురాలిగా న‌టించిన మృణాల్ ఈ చ‌ర్చ‌లో సంక్లిష్ఠ అంశాల‌ను ప్ర‌స్థావించ‌నున్నారు.

By:  Tupaki Desk   |   15 March 2024 6:48 AM GMT
మాన‌వ అక్ర‌మ ర‌వాణాపై  UNలో మృణాల్ స్పీచ్
X

హ్యూమ‌న్ ట్రాఫికింగ్ (మాన‌వ అక్ర‌మ ర‌వాణా) దేశానికి సంక్లిష్ఠ స‌మ‌స్య‌గా చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడిన మృణాల్ ఠాకూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సీతా రామం, హాయ్ నాన్న, ధమాకా చిత్రాలతో పాపుల‌రైన మృణాల్ ఠాకూర్ 'హ్యూమన్ కాస్ట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ రిలేటెడ్ సెక్సువల్ వయొలెన్స్' అనే ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు. ఈ ప్యానెల్ న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్య‌క్ర‌మానికి మృణాల్ హాజ‌రుకానుంది.

మానవ అక్రమ రవాణాతో దాని సంబంధాలు సహా సంఘర్షణ, లైంగిక హింస వంటి దుష్ప‌రిణామాల గురించి ప్యానెల్ చ‌ర్చించింది. ఇదే త‌ర‌హా క‌థాంశం ఉన్న 'లవ్ సోనియా'లో మృణాల్ న‌టించినందున మాన‌వ‌ అక్రమ రవాణా బాధితురాలిగా న‌టించిన మృణాల్ ఈ చ‌ర్చ‌లో సంక్లిష్ఠ అంశాల‌ను ప్ర‌స్థావించ‌నున్నారు.

ఈ ప్యానెల్ చర్చలో భాగమవ్వడం నాకు గొప్ప గౌరవం. లవ్ సోనియా కేవలం ఒక చిత్రం కాదు. ఇది మానవత్వం చీకటి మూలల్లోకి ప్రయాణం. మానవ అక్రమ రవాణా బాధితులు అనుభవిస్తున్న అనూహ్యమైన బాధల గురించి వెలుగులోకి తెచ్చాను. నా పాత్ర ద్వారా ఈ సమస్య సంక్లిష్టతలను లోతుగా పరిశోధించే అవకాశం నాకు లభించింది. అది నా హృదయానికి చాలా దగ్గరైన కారణంగా మారింది. ప్యానెల్ చ‌ర్చ‌లో పాల్గొనడం వల్ల అవగాహన పెంచడం .. మార్పు కోసం వాదించే ప్రయత్నానికి నా స్వరాన్ని వినిపించ‌గలుగుతున్నాను. నిశ్శబ్దంగా మారిన గొంతులను తిరిగి వినిపించేందుకు లైంగిక హింస నుండి బయటపడిన వారితో సంఘీభావంగా నిలబడటానికి ఇది ఒక అవకాశం. ఈ ప్లాట్‌ఫారమ్‌కు నేను చాలా కృతజ్ఞురాలిని. ముఖ్యమైన సంభాషణలకు సహకరించాల‌నే ఆసక్తి నాలో ఉంది'' అని తెలిపారు.

ప్యానెల్‌లో మృనాల్‌తో కలిసి మాషా ఎఫ్రోసినినా, ఫౌజియా కూఫీ, కోహవ్ ఎల్కయం లెవీ, మీజా గెబ్రెమెడిన్, అరేగ్ ఎల్హాగ్‌విల్ వంటి స్పీకర్లు ఉన్నారు.