Begin typing your search above and press return to search.

సీత కోసం క్యూ కడుతున్న ఆఫర్స్

అయితే బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు తెలుగులో చేసిన సీతారామం మూవీతో లభించింది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 4:19 AM GMT
సీత కోసం క్యూ కడుతున్న ఆఫర్స్
X

మృణాల్ ఠాకూర్ పేరు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతోంది. సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి చిత్రంతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సీత పాత్రకి వంద శాతం న్యాయం చేసిందనే కితాబులు దక్కాయి. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ తో మృణాల్ ఠాకూర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయాయి.

బాలీవుడ్ లో సీరియల్స్ ద్వారా నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన మృణాల్ ఠాకూర్ మరాఠీ సినిమాతో హీరోయిన్ అయ్యింది. తరువాత హిందీలో చాలా సినిమాలలో నటించింది. అయితే బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు తెలుగులో చేసిన సీతారామం మూవీతో లభించింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే బాలీవుడ్ సెలబ్రెటీలు సైతం సీతారామం సినిమాలో మృణాల్ నటనని ప్రశంసించారు.

ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ లో కూడా మృణాల్ ఠాకూర్ కి ఆఫర్స్ పెరిగాయి. అయితే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయితే సౌత్ లో మాత్రం ఈ బ్యూటీకి వరుసగా అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నానికి జోడీగా హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండకి జోడీగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మృణాల్ హీరోయిన్.

మెగాస్టార్ చిరంజీవితో వశిష్ఠ మల్లిడి చేయనున్న సోషియో ఫాంటసీ చిత్రంలో ఒక కథానాయికగా మృణాల్ ని ఎంపిక చేయాలని అనుకుంటున్నారంట. అనుష్కతో పాటుగా ఈమె ఉంటుందంట. శివ కార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా ఖరారు చేసారంట. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కలయికలో రాబోయే సినిమాకి మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలిస్తున్నారు.

కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ సుదీర్ఘ విరామం తీసుకొని గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ ఇప్పటికే స్టార్ట్ అయ్యిందంట. ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.