Begin typing your search above and press return to search.

మృణాల్ పిప్పా.. పాజిట్ టాక్ తో వివాదం..!

లాస్ట్ ఇయర్ సీతారామంతో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది.

By:  Tupaki Desk   |   15 Nov 2023 1:30 AM GMT
మృణాల్ పిప్పా.. పాజిట్ టాక్ తో వివాదం..!
X

లాస్ట్ ఇయర్ సీతారామంతో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. సీతారామం హిట్ తో తెలుగులో ఫేవరెట్ హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటున్న అమ్మడు బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా హిందీలో మృణాల్ నటించిన పిప్ప సినిమా అమేజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఓటీటీ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ కథ ఏంటంటే బంగ్లాదేష్ ని ఆక్రమించుకుని తూర్పు పాకిస్తాన్ గా మార్చాలని నరమేధం సృష్టిస్తుంది పాకిస్తాన్. దాని కోసం ఉద్యమించిన వారితో పాటుగా సామాన్యులను సైతం దారుణంగా హత్యచేసి మహిళలు, పిల్లలను బందీలుగా చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో పరిస్థితుల్లో మానవత్వంతో బంగ్లా నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని లక్షమంది శరణార్ధులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుంది. ఇది సహించలేని పాకిస్తాన్ భారత్ పై కొన్ని చోట్ల బాంబు దాడులు చేస్తుంది. దీంతో బంగ్లా విముక్తికి ప్రధాని ఇందిరా గాంధీ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తూ సైన్యాన్ని పంపుతుంది. ఈ టైం లో పాక్ సైన్యంపై భారత్ ఎలా విజయం సాధించింది.. బలరాం సోదరుడు రాం మెహతా సైన్యంకు అప్పగించిన మిషన్ ఏంటి..? ఈ సమస్య ఎలా పరిష్కరించారు అన్నది సినిమా కథ.

భారత సైన్య ధైర్య సాహసాలను అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు. 1971 ఇండో పాకిస్థాన్‌ యుద్ధం. పాకిస్థాన్‌ చేతుల్లోకి వెళ్లకుండా బంగ్లానిదేష్ కి విముక్తి పోరాటంలో భారత్‌ అందించిన సాయం వీటన్నిటికీ తెరరూపం చూపించారు. అప్పటి యుద్ధంలో ఒక అంకానికి అక్షర రూపం దాల్చిన బ్రిగేడియర్‌ బలరామ్‌ సింగ్‌ మెహతా రాసిన ది బర్నింగ్ చాఫే బుక్ ఆధారంగా తెరకెక్కిన సినిమానే పిప్పా.

బలమైన కథ అందుకు తగిన ఎమోషన్ తో సినిమాను నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సినిమా పై అనుకోకుండా ఒక వివాదం మొదలైంది. పిప్పా సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో ప్రముఖ బెంగాలీ కవి ఖాజీ నజ్రుల్ రాసిన ఒక దేశ భక్తి గీతాన్ని వాడేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయల్టీ చెల్లించకుండా పిప్పాలో ఆ భక్తి గీతం వాడటాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు రావడంతో టీం స్పందించింది.

పిప్పా టీం అన్ని అనుమతులు తీసుకునే ఆ పాటను సినిమాలో సందర్భానికి తగినట్టుగా నివాళిగా వాడుకున్నామని అన్నారు. ఖాజీ గారి రచనల మీద ఎంతో గౌరవం దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు వందనం చేసే కోణంలోనే ఆ పాట పెట్టామని ఒక నోట్ విడుదల చేశారు. అగ్రిమెంట్ రాయించుకుని ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకున్నామని వివరణ ఇచ్చారు. ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమాపణ కోరుతున్నామని ఆ నోట్ లో పేర్కొన్నారు. పిప్పా నిర్మించిన రే కపూర్ ఫిలింస్ రిలీజ్ చేసిన నోట్ ని సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ రీ ట్వీట్ చేశారు.