Begin typing your search above and press return to search.

మృణాల్.. సో కూల్!!

టాలీవుడ్ సీతగా పాపులర్ అయ్యింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఫస్ట్ మూవీ సీతారామం తో మంచి క్రేజ్ సంపాదించుకుంది

By:  Tupaki Desk   |   11 Jun 2024 9:59 AM GMT
మృణాల్.. సో కూల్!!
X

టాలీవుడ్ సీతగా పాపులర్ అయ్యింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఫస్ట్ మూవీ సీతారామం తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయంతో సీతామహాలక్ష్మి రోల్ లో అలరించి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. వరుస సినిమా ఆఫర్లు వస్తున్నా.. ఆచితూచి సెలెక్ట్ చేసుకుంది. నానితో హాయ్ నాన్న సినిమాలో నటించి మరోసారి మెప్పించింది.

ఇక విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ లో యాక్ట్ చేసిన మృణాల్ ఠాకూర్.. హ్యాట్రిక్ హిట్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రెస్పాన్స్ మాత్రమే దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్క మూవీ కూడా అనౌన్స్ చేయలేదు మృణాల్. కానీ చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్.

అయితే ఈమధ్య రాఘవ లారెన్స్ అనౌన్స్ చేసిన కాంచన-4లో మృణాల్ యాక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త‌న క్యారెక్ట‌ర్‌ ను డిజైన్ చేసిన తీరు న‌చ్చ‌డంతో హార‌ర్ కామెడీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. కానీ ఆ వార్తలు నిజం కావని లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు అందుకుంటోంది. మూవీ రిజల్ట్ తో ఎలాంటి సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మృణాల్.. తన అందచందాలతో అలరిస్తుంటోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది. అందాలు ఆరబోసి కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంటూ ఉంటోంది. లేటెస్ట్ గా ఇంగ్లీష్ మ్యాగ్ జైన్ The Peacock కవర్ పేజీపై ప్రత్యక్షమైంది. ఇంటర్వ్యూలో తన గోల్స్, కెరీర్ తదితర విషయాలను మృణాల్ పంచుకుందని మ్యాగ్ జైన్ నిర్వాహకులు తెలిపారు. ఆమె గురించి రాసుకొచ్చిన లాంగ్ నోట్ ఆకట్టుకుంటోంది.

అయితే మ్యాగ్ జైన్ కవర్ పేజ్ పై గ్రే కలర్ డ్రెస్ లో తళుక్కుమంది మృణాల్. అమాయకపు చూపుతో ఫిదా చేస్తోంది. ఎద అందాలతో సెగలు పుట్టిస్తోంది. అదిరిపోయే నెక్ సెట్.. ఆమె అందాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం మృణాల్ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అమ్మడు సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కూల్, స్టన్నింగ్, ఫైర్ అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఏ డ్రెస్ లోనైనా సూపర్ అని పొగిడేస్తున్నారు.