Begin typing your search above and press return to search.

తెలుగు ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన మృణాల్‌

ఉత్తరాదిన సీరియల్స్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన మృణాల్‌ ఠాకూర్‌ బాలీవుడ్ లో అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించింది

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:30 AM GMT
తెలుగు ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన మృణాల్‌
X

ఉత్తరాదిన సీరియల్స్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన మృణాల్‌ ఠాకూర్‌ బాలీవుడ్ లో అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించింది. హిందీ సినిమాలతో మృణాల్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హిందీలో సినిమాలు చేస్తున్న సమయంలో ఈ అమ్మడు తెలుగు లో సీతారామం సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

తెలుగు సినిమా సీతారామం వల్లే మృణాల్‌ కి ఈ స్థాయి గుర్తింపు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మృణాల్ తెలుగు సినిమాలను నిర్లక్ష్యం చేస్తుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్‌ సినిమా చేస్తున్న ఈ అమ్మడు తదుపరి బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేయకుండా తమిళ సినిమాలకు కమిట్ అయ్యింది. శింబు హీరోగా రూపొందబోతున్న సినిమాతో పాటు శివ కార్తికేయన్‌, మురుగదాస్‌ కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా మృణాల్‌ హీరోయిన్‌ గా నటించేందుకు ఓకే చెప్పింది.

తమిళ స్టార్‌ హీరో అజిత్ తో కలిసి కూడా ఈ ఏడాది చివర్లో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మృణాల్‌ ఠాకూర్ బ్యాక్ టు బ్యాక్‌ మూడు సినిమాలు తమిళ సినీ ఇండస్ట్రీలో చేసేందుకు ఓకే చెప్పడం.. తెలుగులో మాత్రం ఫ్యామిలీ స్టార్‌ కాకుండా ఇంకా ఏ ఒక్కటి కన్ఫర్మ్‌ చేయక పోవడం పట్ల ఫ్యాన్స్ కోపంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ రెగ్యులర్‌ గా ఈ అమ్మడిని సంప్రదిస్తూనే ఉన్నారట. అయినా కూడా తమిళ సినిమాలకే ఎక్కువగా ఈమె ప్రాముఖ్య ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా మృణాల్ ను ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మృణాల్ ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.