Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్‌ తో సంబంధం లేకుండా మృణాల్‌...!

గతంలో మాదిరిగానే వచ్చిన ప్రతి ఆఫర్‌ ను ఒప్పేసుకోకుండా.. ఆచి తూచి వ్యవహరిస్తుంది.

By:  Tupaki Desk   |   13 April 2024 4:08 AM GMT
ఫ్యామిలీ స్టార్‌ తో సంబంధం లేకుండా మృణాల్‌...!
X

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా దశాబ్ద కాలం అవుతున్నా కూడా దక్కని గుర్తింపు, రాని స్టార్‌ డం టాలీవుడ్‌ లో సీతారామం సినిమా చేయడంతో మృణాల్ ఠాకూర్ కి దక్కింది. తెలుగు లో మొదటి సినిమానే సూపర్‌ హిట్ అవ్వడంతో వెంటనే నానికి జోడీగా హాయ్‌ నాన్న సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఆఫర్లకి ఓకే చెప్పకుండా ఆచి తూచి ఆఫర్లకు కమిట్‌ అవుతున్న మృణాల్‌ ఠాకూర్ తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచింది. టాలీవుడ్‌ లో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించిన మృణాల్ కి నిరాశే ఎదురయ్యింది.

ఫ్యామిలీ స్టార్‌ కమర్షియల్‌ ఫలితం తో సంబంధం లేకుండా ఈ సినిమాలో కూడా మృణాల్‌ బాగుంది అంటూ ఆమె ఫ్యాన్స్ తో పాటు కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే ఫ్యామిలీ స్టార్‌ గురించి పట్టింపు లేకుండా చాలా ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయట.

గతంలో మాదిరిగానే వచ్చిన ప్రతి ఆఫర్‌ ను ఒప్పేసుకోకుండా.. ఆచి తూచి వ్యవహరిస్తుంది. ఇటీవలే ఒక యంగ్‌ హీరో సినిమాను మృణాల్ తిరస్కరించిందని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో మృణాల్‌ ఠాకూర్ పారితోషికం కూడా పెంచేసిందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

సాధారణంగా ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితే ఆ హీరో లేదా హీరోయిన్ పారితోషికం తగ్గడం మనం చూస్తూ ఉంటాం. కానీ మృణాల్‌ పారితోషికం ఇంకాస్త పెరిగిందే కానీ తగ్గలేదు. కెరీర్‌ లో తప్పటడుగులు వేస్తే హిట్‌ పడ్డా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే కాస్త జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తే మృణాల్‌ మాదిరిగా ఫ్లాప్‌ పడ్డా పెద్దగా ఫరక్ పడదు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.

ముందు ముందు మృణాల్‌ నుంచి పెద్ద హీరోల సినిమాలు, మంచి సినిమాలు, హిట్‌ సినిమాలు వస్తాయని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆమె కూడా అదే విధంగా తన సినిమాలు ఉంటాయి, ఉండబోతున్నాయి అన్నట్లుగా నమ్మకంగా కనిపిస్తుంది.