Begin typing your search above and press return to search.

మృణాల్ హిట్ సెంటిమెంట్ ఆ సినిమాకు కలిసొస్తుందా..?

పరశురామ్ డైరెక్షన్ లో గీతా గోవిందం తో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ మళ్లీ అదే కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 2:30 AM GMT
మృణాల్ హిట్ సెంటిమెంట్ ఆ సినిమాకు కలిసొస్తుందా..?
X

బాలీవుడ్ సీరియల్స్ లో సత్తా చాటి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ లు అందుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం తో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అమ్మడు. సీతారామం హిట్ తెలుగులో అవకాశాలు వచ్చేలా చేసింది. ఇక రీసెంట్ గా నానితో హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది మృణాల్ ఠాకూర్.

కథల ఎంపికల్లో పరిణితి కావొచ్చు.. ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే ప్రతిభ కావొచ్చు.. కారణాలు ఏవైనా తెలుగులో సీతారామ, హాయ్ నాన్న చేసిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో మృణాల్ క్రేజ్ డబుల్ అయ్యింది. అంతేకాదు అమ్మడు టాలీవుడ్ లో లక్కీ హ్యాండ్ గా మారింది. మృణాల్ సినిమాలో ఉంటే సినిమా హిట్టే అన్న టాక్ వచ్చేసింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ కు కలిసి వచ్చేలా ఉంది.

పరశురామ్ డైరెక్షన్ లో గీతా గోవిందం తో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ మళ్లీ అదే కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. సినిమా నుంచి వచ్చిన ఐరనే వంచాలా ఏంటి టీజర్ సినిమాపై బజ్ పెంచింది. ఎలాగు మృణాల్ పాజిటివ్ సెంటిమెంట్ కూడా ఫ్యామిలీ స్టార్ కి బాగా కలిసి వచ్చేలా ఉంది.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని అసలైతే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పొంగల్ ఫైట్ లో రిస్క్ ఎందుకని సినిమాను వాయిదా వేసుకున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా హిట్ పడితే మాత్రం తప్పకుండా మృణాల్ గోల్డెన్ హ్యాండ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పొచ్చు. కథల విషయంలో మృణాల్ జాగ్రత్త వహించడం వల్లే ఆమెకు వరుస సక్సెస్ లు వస్తున్నాయని చెప్పొచ్చు. ఫ్యామిలీ స్టార్ విషయంలో మృణాల్ సెంటిమెంట్ ఏమేరకు కలిసి వస్తుంది అన్నది చూడాలి.

గీతా గోవిందం హిట్ కాంబో కాబట్టి ఫ్యామిలీ స్టార్ మీద ఆటోమేటిక్ గా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం దగ్గరగా ఉన్నా సరే సినిమా హిట్ అందుకునే ఛాన్స్ ఉంది.