Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఫిల్మ్‌ ఫేర్‌ వేదికపై మృణాల్‌ అందాల రచ్చ

తాజాగా మరోసారి ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు వేడుకల్లో మృణాల్‌ ఠాకూర్‌ అందాల ఆరబోత ఫోటోలతో సందడి చేసింది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 11:28 AM GMT
పిక్ టాక్‌ : ఫిల్మ్‌ ఫేర్‌ వేదికపై మృణాల్‌ అందాల రచ్చ
X

సీతారామం సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌ తాజాగా హాయ్‌ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు సినిమాలతో టాలీవుడ్‌ లో దక్కించుకున్న మృణాల్‌ ఠాకూర్‌ త్వరలో విజయ్ దేవరకొండతో కలిసి 'ఫ్యామిలీ స్టార్‌' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఒక వైపు హీరోయిన్‌ గా చాలా పద్దతైన పాత్రల్లో కనిపిస్తూ ఉండే మృణాల్ ఠాకూర్ సోషల్‌ మీడియాలో మాత్రం అందాల ఆరబోత తో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు వేడుకల్లో మృణాల్‌ ఠాకూర్‌ అందాల ఆరబోత ఫోటోలతో సందడి చేసింది.

వైట్‌ డ్రెస్ లో క్లీ వేజ్ అందాల షో చేస్తూ మిరుమిట్లు గొలుపుతూ వావ్‌ అనిపించేంత అందంతో ఆకట్టుకుంది. ఈ స్థాయి అందం ను గతంలో మృణాల్ ఎప్పుడు కూడా చూపించలేదు అంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటున్నారు.

ఎంతో మంది ముద్దుగుమ్మలకు ఫిల్మ్‌ ఫేర్ అవార్డు వేడుకల్లో పాల్గొన్నారు. వారందరిలోకి మృణాల్ ఠాకూర్ అందంగా ఆకర్షణీయంగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత కారణంగా నార్త్‌ మరియు సౌత్‌ లో బిజీ బిజీగా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.