Begin typing your search above and press return to search.

క్యూట్ లో హాటుగా.. ఈమెకే సాధ్యం!

కొంతమంది హీరోయిన్స్ ఒక సినిమాలో చాలా ట్రెడిషనల్ లుక్ తో కనిపించి సడన్ గా మళ్లీ గ్లామర్ డ్రెస్సులో కనిపిస్తే ఓ వర్గం ఫ్యాన్స్ అంతగా యాక్సెప్ట్ చేయలేరు

By:  Tupaki Desk   |   12 March 2024 6:15 PM GMT
క్యూట్ లో హాటుగా.. ఈమెకే సాధ్యం!
X

కొంతమంది హీరోయిన్స్ ఒక సినిమాలో చాలా ట్రెడిషనల్ లుక్ తో కనిపించి సడన్ గా మళ్లీ గ్లామర్ డ్రెస్సులో కనిపిస్తే ఓ వర్గం ఫ్యాన్స్ అంతగా యాక్సెప్ట్ చేయలేరు. మరికొందరు సడన్ గా బికినీలు వేసిన కూడా చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక పాజిటివ్ గా కూడా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా ఒకే తరహాలో ఇండస్ట్రీలో కొనసాగడం అనేది హీరోయిన్స్ కెరీర్ కు కూడా అంత ఈజీ కాదు.

ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్లు కూడా చేంజ్ అవుతూ ఉండాలి. మంచి సినిమాలు వస్తే కొన్నిసార్లు పాత్ర డిమాండ్ ను బట్టి గ్లామర్ డోస్ పెంచాల్సి ఉంటుంది. ఇక పాత్రకు తగ్గట్టుగా తనను తాను ఎప్పుడూ సరికొత్తగా మార్చుకునే హీరోయిన్స్ లలో మృణాల్ ఠాగూర్ కూడా ఉంది. ఈ బ్యూటీని మొదటగా తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో బాగా కనెక్ట్ అయింది.

అయితే అంతకుముందే అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసింది. అలాగే వెబ్ సీరీస్ లలో కూడా కనిపించింది. ఇక మృణాల్ మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో కొన్నిసార్లు బికినీలో కూడా దర్శనమిచ్చింది. ఇక సీతారామం సినిమా చూసిన తర్వాత తెలుగు ఆడియోన్స్ ఆమె బికినీ ఫొటోలు చూసి షాక్ అయ్యారు. సీత పాత్రలో బాగా కనెక్ట్ అయిన అమ్మడు హఠాత్తుగా అల్ట్రా గ్లామర్ తో షాక్ ఇచ్చేసరికి ఎవరు నమ్మలేకపోయారు.

ఇక మృణాల్ క్యారెక్టర్ కు తగ్గట్టుగా గ్లామర్ ను హైలెట్ చేస్తుందని చెప్పవచ్చు. ఫ్యామిలీ స్టార్ లో ఆమె ఎలా కనిపించబోతుందో ఇటీవల ఒక సాంగ్ తో మరోసారి అర్థమయింది. ఫ్యామిలీ స్టార్ కు సంబంధించిన కళ్యాణి వచ్చే వచ్చే.. అనే లిరికల్ పాటను రీసెంట్ గా విడుదల చేశారు. అయితే అందులో లెహంగాలో చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఆమె ఒక చాలా క్యూట్ గా కనిపిస్తూనే మరొకవైపు ఏద అందాలతో కూడా గ్లామర్ ను మరింత ఘాటుగా హైలైట్ చేసింది.

నెగిటివ్ కామెంట్స్ కు ఏమాత్రం తావివ్వకుండా మృణాల్ ఆ ఫ్రేమ్ లో హైలెట్ అయ్యిందని చెప్పవచ్చు. తన చిరునవ్వుతోనే ఎక్కువగా డామినేట్ చేసిన అమ్మడు మరొకవైపు గ్లామర్ పరంగా కూడా ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. చూస్తుంటే సినిమాలో అమ్మడు తన లుక్స్ తోనే హైలెట్ అయ్యే విధంగా కనిపిస్తోంది. మొత్తనికి క్యూట్ లో కూడా హాటుగా కనిపించడంలో ఈమె తరువాతే ఎవరైనా అంటూ నెటిజన్లు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.