Begin typing your search above and press return to search.

మృణాల్ ల‌క్ అనాలా? ట్యాలెంట్ అనాలా?

కొన్ని పాత్ర‌లు కొంత మంది భామ‌ల‌కే రాసిపెట్టి ఉంటాయి. వాళ్లు పోషిస్తేనే వాటికి వ‌న్నె వ‌స్తుంద‌ని మేక‌ర్స్ భావిస్తుంటారు

By:  Tupaki Desk   |   12 Nov 2023 2:30 AM GMT
మృణాల్ ల‌క్ అనాలా? ట్యాలెంట్ అనాలా?
X

కొన్ని పాత్ర‌లు కొంత మంది భామ‌ల‌కే రాసిపెట్టి ఉంటాయి. వాళ్లు పోషిస్తేనే వాటికి వ‌న్నె వ‌స్తుంద‌ని మేక‌ర్స్ భావిస్తుంటారు. అయితే ఇలాంటి ఛాన్సు త‌మ వ‌ర‌కూ రావాల‌న్నా ల‌క్ ఉండాలి. ఇంత ట‌ఫ్ కాంపిటీష‌న్ లో త‌న‌ని వెతుక్కుంటూ ఓ అవ‌కాశం వెళ్లిందంటే? అది నిజంగా ల‌క్ అనే అనాలి. అలాంటి ల‌క్కీ గాళ్ మృణాల్ ఠాకూర్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లో ఎంత మంది స‌క్సెస్ ఫుల్ హీరోయిన్లు లేరు. ఆమెక‌న్నా అంద‌గ‌త్తెలు మ‌రెంత మంది లేరు? కానీ 'సీతారామం'లో సీత పాత్ర‌ని ఆమెని వెతుక్కుం టూ వెళ్లింది.

వ‌చ్చిన అవ‌కాశాన్ని ప్ర‌తిభ‌తో నిరూపించుకుంది. తొలి అవ‌కాశంతోనే గొప్ప న‌టి అని చాటి చెప్పింది. ఆ పాత్ర మృణాల్ కెరీర్ నే మార్చేసింది. కేవ‌లం ఆ రోల్ తోనే తాజాగా అవ‌కాశాలన్ని చేజిక్కిం చుకుంటుంది. నాని స‌ర‌స‌న 'హాయ్ నాన్న‌'లో సైతం బ‌ల‌మైన పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర కూడా పూర్తి స్థాయిలో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న రోల్ గా క‌నిపిస్తుంది. మ‌రోసారి తెలుగు తెర‌పై మృణాల్ మార్క్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటుంది అన్న న‌మ్మ‌కం బ‌లంగా ఉంది.

తోడుగా నేచుర‌ల్ స్టార్ కూడా ఉన్నాడు కాబ‌ట్టి ఆ పాత్ర ఇంకా బ‌లంగా ప‌డ‌టానికి అవ‌కాశం ఉంది. అలాగే బాలీవుడ్ లోనూ అంతే బ‌ల‌మైన పాత్ర‌తో మెప్పిస్తుంది. ఇషాన్ క‌ట్ట‌ర్ తో క‌లిసి 'పిప్పా' అనే వార్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది ఏకంగా స‌వాల్ తో కూడున్న పాత్ర . తోబుట్టువుల‌తో క‌లిసి ఏకంగా యుద్ద‌మే చేయ‌బోతుంది. కెప్టెన్ బ‌ల‌రాం సింగ్ మెహ‌తా జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కింది.

ఇటీవ‌లే రిలీజ్ అయింది. ఇందులో రాధ అనే పాత్ర పోషించింది. సినిమా స‌గ భాగం త‌న పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ రోల్ అమ్మ‌డికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొస్తుంది. ఇలా వ‌రుస‌గా మృణాల్ శ‌క్తివంత‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ స‌త్తా చాటుతుంది. ఇలాంటి అవ‌కాశం రావ‌డం కూడా ల‌క్ అనే అనాలి.