Begin typing your search above and press return to search.

పాత్ర ఎలాంటిదైనా అందులో సీత‌మ్మ స్సెష‌ల్!

'సీతారామం' తో పూణే బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగింట ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   15 Aug 2023 10:36 AM GMT
పాత్ర ఎలాంటిదైనా అందులో సీత‌మ్మ స్సెష‌ల్!
X

'సీతారామం' తో పూణే బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగింట ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సినిమా విజ‌యం త‌ర్వాత ఇక్క‌డ వేగంగా సినిమాలు చేయ‌క‌పోయినా! అమ్మ‌డి ఇమేజ్ మాత్రం ఎక్క‌డా చెక్కు చెద‌ర‌లేదు. అవ‌కాశాలు రాక చేయ‌లేదా? వ‌చ్చినా వ‌ద్ద‌నుకుని త‌గ్గిందా? అన్న‌ది తెలియ‌దు కానీ...అమ్మ‌డి తాజా ప్రోగ్ర‌స్ చూస్తే మ‌నసంతా బాలీవుడ్ పైనే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న ఓ సినిమా చేస్తున్న‌ప్ప‌టికీ మృణాల్ బాలీవుడ్ క‌మిట్ మెంట్లు ఎక్కువ క‌నిపిస్తున్నాయి. అక్క‌డా ఏ చిన్న ఛాన్స్ వ‌చ్చినా విడిచిపెట్ట‌డం లేదు. నో అన‌కుండా న‌టించి వెళ్లిపోతుంది. ఇలా క‌మిట్ అవ్వ‌డం వెనుక ఓ ప్ర‌త్యేక కార‌ణం క‌నిపిస్తుంది. మృణాల్ ఎలాంటి బ్యాక‌ప్ లేకుండా వ‌చ్చి ప్రూవ్ చేసుకున్న న‌టి. సినిమాల‌కంటే ముందు వెబ్ సిరీస్ లు చేసింది.

కొన్ని టెలివిజ‌న్ షోస్ కూడా చేసింది. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ వ‌చ్చిన చిన్న చిన్న అవ‌కాశాలు కూడా ఇప్ప‌టికీ వ‌దులుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లు సిరీస్ ల్లో చిన్న పాత్ర‌లు పోషించినా...తెర‌పై క‌నిపించిన కాసేపు ఆ పాత్ర ఆక‌ట్టుకునేలా చేసింది. తాజాగా రిలీజ్ అయిన 'మెడి ఇన్ హెవెన్' టీవీ సిరీస్ లోనూ మృణాల్ అద‌ర‌గొట్టింది. ఇందులో మృణాల్ మెయిన్ లీడ్ పోషించ‌లేదు..కీల‌క పాత్ర పోషించ‌లేదు.

కేవ‌లం గెస్ట్ పాత్ర లోనై త‌న‌దైన ముద్ర వేసింది. ఓ సంప‌న్న వ్యాపార వేత్త‌-మృణాల్ మ‌ధ్య స‌న్నివేశాలు ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాయి. ఆ జీవితంలో మృణాల్ పాత్ర యోక్క చీక‌టి కోణాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్క‌రించారు. ఆ పాత్ర‌కి మృణాల్ మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని మ‌రోసారి నిరూపించింది.

ఓ సాధార‌ణ మ‌హిళ శారీర‌..మాన‌సిక ఇబ్బందుల‌కు గురైతే ఎలా ఉంటుందో.. మృణాల్ పాత్ర‌లో క‌ళ్ల‌కు క‌ట్టారు. కొట్ట‌డం..తిట్ట‌డం..కాలి బూట్ల‌తో త‌న్న‌డం వంటి స‌న్నివేశాలు ఎంతో హృద్యంగా ఉన్నాయి. ఆ పాత్ర‌లో మృణాల్ అభిన‌యం..ఆహార్యం అద్భుతం. ఎలాంటి పాత్రైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టి అని మృణాల్ మ‌రోసారి నిరూపించింది.