పిక్ టాక్ : టైట్ బ్లాక్ ఔట్ ఫిట్ లో కన్నుల విందు
బ్లాక్ డ్రెస్ లో టాప్ లేపేసిన మృణాల్ ఠాకూర్ మ్యాడ్ ఫోజ్ లు ఇస్తూ అలరిస్తోంది. బ్లాక్ వెల్వెట్ డ్రెస్ లో ఈ అమ్మడు భలే ముచ్చటగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 6 Oct 2023 6:30 PM ISTఉత్తరాది ప్రేక్షకులను బుల్లి తెర ద్వారా మొదట ఎంటర్ టైన్ చేసిన మృణాల్ ఠాకూర్ అక్కడ నుంచి వెండి తెరపై అడుగు పెట్టింది. బుల్లి తెర నుంచి వెండి తెర పై అడుగు పెట్టినా కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా షో చేస్తూనే ఉంది. టాలీవుడ్ లో సీతారామం సినిమా తో అడుగు పెట్టింది.
ప్రస్తుతం నానితో ఒక సినిమాను చేయడంతో పాటు సౌత్ లో పలు సినిమాలకు ఇప్పటికే సైన్ చేసింది. బాలీవుడ్ లో కూడా ఈమె వరుస సినిమాలతో జోష్ మీద ఉంది. ఒక వైపు సినిమాల్లో బిజీ బిజీగా నటిస్తూ ఆకట్టుకుంటూ ఉంది. మరో వైపు ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చి పోతూ ఉంది. తాజాగా టైట్ బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసింది.
సాధారణంగా వైట్ డ్రెస్ లో ముద్దుగుమ్మలు ఏంజిల్స్ మాదిరిగా ఉంటారు. బ్లాక్ డ్రెస్ చాలా కొద్ది మందికి మాత్రమే నప్పుతాయి. అలాంటిది మృణాల్ ఠాకూర్ కి బ్లాక్ డ్రెస్ అదిరింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రెస్ లో టాప్ లేపేసిన మృణాల్ ఠాకూర్ మ్యాడ్ ఫోజ్ లు ఇస్తూ అలరిస్తోంది. బ్లాక్ వెల్వెట్ డ్రెస్ లో ఈ అమ్మడు భలే ముచ్చటగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే ముందు ముందు మరిన్ని సినిమాల్లో హాట్ పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.
