Begin typing your search above and press return to search.

అమీర్ కూతురి విందులో మృణాల్ హొయ‌లు

జనవరి 10న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన సాంప్రదాయ క్రైస్తవ వేడుకలో పెళ్లి చేసుకున్న తర్వాత అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ -నుపుర్ శిఖరే జనవరి 13న NMACCలో పెళ్లి రిసెప్షన్‌ను నిర్వహించారు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 6:55 AM GMT
అమీర్ కూతురి విందులో మృణాల్ హొయ‌లు
X

జనవరి 10న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన సాంప్రదాయ క్రైస్తవ వేడుకలో పెళ్లి చేసుకున్న తర్వాత అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ -నుపుర్ శిఖరే జనవరి 13న NMACCలో పెళ్లి రిసెప్షన్‌ను నిర్వహించారు. న‌వ‌ వధువు తండ్రి నటుడు, అమీర్ ఖాన్ ఈ వేడుక‌ల‌ను భారీగా ప్లాన్ చేసారు. ఖాన్-నూపూర్ శిఖరే వెడ్డింగ్ రిసెప్షన్ లో అతిథుల హంగామాకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఐరా ఎరుపు రంగు లెహంగాలో కొద్దిపాటి ఆభరణాలు స్మోకీ మేకప్ లుక్‌తో అందంగా కనిపించింది. నుపుర్ తన రిసెప్షన్‌కు నల్లటి షేర్వాణీని ధరించాడు. ఇరా ఖాన్ - నుపుర్ శిఖరే జనవరి 3 న ముంబైలో రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా తమ సంబంధాన్ని అధికారికం చేసుకున్నారు.


నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో జ‌రిగిన‌ రిసెప్షన్ లో చాలా మంది స్టార్లు క‌నిపించ‌గా, ఇందులో అందాల క‌థానాయిక‌ మృణాల్ ఠాకూర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మృణాల్ ఎప్ప‌టిలానే ఈ ఈవెంట్ కి చాలా సింపుల్ లుక్ తో హాజ‌రైనా కానీ, త‌న‌దైన అంద‌మైన చిరున‌వ్వు బ్రిలియ‌న్సీతో క‌ట్టి ప‌డేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతోంది. ఇక మృణాల్ ఈవెంట్ కి చేరుకోగానే ఫోటోగ్రాఫ‌ర్లు త‌న‌పై ఫ్లాష్ ల‌తో విరుచుకుప‌డ్డారు. మృణాల్ ద‌క్షిణాదిన పెద్ద స్టార్. ఇప్పుడు హిందీ ప‌రిశ్ర‌మ‌లోను ఓ వెలుగు వెలిగేందుకు త‌న‌వైన ప్ర‌ణాళిక‌ల‌ను క‌లిగి ఉంది.

ఈవెంట్లో ఇరా- నూపుర్ జంట రొమాంటిక్ ఫోజ్ కూడా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. అమీర్ ఖాన్ - అతని మాజీ భార్య రీనా దత్తా కుమార్తె అయిన ఇరా ఖాన్ కి ఇది ఎంతో గొప్ప ఆనంద‌క్ష‌ణం. ఈ పార్టీకి బాలీవుడ్ మొత్తం త‌ర‌లివ‌చ్చింది. ఇరా ముంబై రిసెప్షన్‌కు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, నాగ చైతన్య త‌దిత‌ర‌ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. షోబిజ్ నుండి పెద్ద స్టార్ల‌తో పాటు, క్రీడారంగం, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకకు విచ్చేసి న‌వ‌దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. ఈ వివాహ రిసెప్షన్‌లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొన్నారు.