Begin typing your search above and press return to search.

మృణాల్‌ పెళ్లి కామెంట్స్ వైరల్‌

ఉత్తరాది ప్రేక్షకులను బుల్లి తెర మరియు వెండి తెర ద్వారా అలరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌

By:  Tupaki Desk   |   8 Dec 2023 7:01 AM GMT
మృణాల్‌ పెళ్లి కామెంట్స్ వైరల్‌
X

ఉత్తరాది ప్రేక్షకులను బుల్లి తెర మరియు వెండి తెర ద్వారా అలరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్‌ కి జోడీగా సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించి టాలీవుడ్‌ కి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో ఈ అమ్మడు చేరింది.

ప్రస్తుతం టాలీవుడ్‌ లో మృణాల్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా నిలిచింది. తాజాగా హాయ్‌ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు విజయ్‌ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటుంది. విదేశాల్లో విజయ్ తో కలిసి ఆ సినిమా షూటింగ్‌ చేస్తున్న మృణాల్ తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

న్యూజెర్సీ లో మృణాల్‌ ఠాకూర్‌ తో స్థానిక తెలుగు మరియు ఇతర ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు చిట్‌ చాట్‌ చేశారు. ఆ సందర్భంగా హాయ్ నాన్న సినిమా తనకి చాలా స్పెషల్‌ గా పేర్కొంది. అంతే కాకుండా ఆ సినిమాలో పోషించిన పాత్ర తన హృదయానికి దగ్గరగా ఉందని కూడా మృణాల్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చింది.

ఫ్యాన్స్ తో చిట్‌ చాట్‌ సందర్భంగా ఒక కుర్రాడు మీకు పెళ్లి అయిందా అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో మృణాల్‌ నవ్వుతూ ఇంకా పెళ్లి కాలేదు. అయితే త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది.

మృణాల్ ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అంటే పెద్దగా చర్చ ఉండేది కాదు.. కానీ త్వరలోనే పెళ్లి అంటూ ఆమె చెప్పింది కనుక ఇప్పటికే ఆమె మనసులో ఎవరో ఉండే ఉంటారు అంటూ మీడియాలో ఆమె పెళ్లి గురించిన చర్చ మొదలు అయింది. ఇంతకు మృణాల్‌ మనసులో ఎవరైనా ఉండి ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.