Begin typing your search above and press return to search.

యువరాణిలా మృణాల్.. ఎందరి మనసులు దోచిందో!

హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. సీతారామం మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2024 11:35 AM GMT
యువరాణిలా మృణాల్.. ఎందరి మనసులు దోచిందో!
X

హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. సీతారామం మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతోనే టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం అయిన మృణాల్.. తొలి సినిమాలో తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీగా అందరి మనసుల్లో నిలిచిపోయింది.


తెలుగులో ఫస్ట్ మూవీతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో క్రేజ్ కూడా దక్కించుకుంది. వరుస అవకాశాలు వచ్చినా.. ఆచితూచి అడుగులు వేసింది. సీతారామం తర్వాత.. నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్నలో యాక్ట్ చేసింది. ఆ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించ లేకపోయింది. అయితే సినిమాలో యాక్టింగ్ తో మృణాల్ మాత్రం మెప్పించింది. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు టాక్ వస్తోంది. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు రాలేదు. చిరంజీవి విశ్వంభరతో పాటు ప్రభాస్ కల్కి చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది మృణాల్ ఠాకూర్. రకరకాల ఔట్ ఫిట్స్ తో ఫోటోస్ దిగి పోస్ట్ చేస్తుంటోంది. తాజాగా ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది అమ్మడు. మెరూన్ కలర్ లెహంగాలో మెరిసిపోయింది. కంప్లీట్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసి ఉన్న లెహంగాలో యువరాణిలా ఫిదా చేస్తోంది. తన నవ్వుతో అందరినీ మాయ చేస్తోంది.

ఝంకాలు.. తలకు మల్లె పూలు.. చిన్న బొట్టు.. ఆమెను మరింత అందంగా మార్చాయి. ఎద అందాలతో కూడా కవ్విస్తోంది. ప్రస్తుతం మృణాల్ నయా పిక్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అమ్మడు గ్లామర్ కు ఫ్లాట్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సో నైస్ బ్యూటీ.. అంటూ సందడి చేస్తున్నారు. అందానికి పర్యాయ పదం అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.