Begin typing your search above and press return to search.

మృణాల్.. హిట్టు పడకపోయినా సేఫే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో ఫస్ట్ మూవీ సీతారామంతో అందరి మనసులు గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   8 April 2024 5:16 AM GMT
మృణాల్.. హిట్టు పడకపోయినా సేఫే..
X

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో ఫస్ట్ మూవీ సీతారామంతో అందరి మనసులు గెలుచుకుంది. సీతగా తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. టాలీవుడ్ ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో నాని సరసన అలరించింది. ఈ మూవీలో కూడా యాక్టింగ్ తో సినీ ప్రియులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. ఏప్రిల్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ అందుకుంది. చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతున్నట్లు చెబుతోంది. ఈ మూవీతో టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ హ్యాట్రిక్ హిట్ కొడుతుందని అంతా భావించారు.

అయితే మృణాల్ సక్సెస్ జోష్ కు ఫ్యామిలీ స్టార్ చిత్రం బ్రేక్ వేసింది. కానీ ఈ మూవీలో మృణాల్ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. ఫస్టాఫ్ లో ఈ బ్యూటీ ఇందు రోల్ లో నవ్వుతూ ఎంతో అందంగా స్క్రీన్ పై కనిపిస్తోంది. సెకండాఫ్ లో కూడా ఆమె భావోద్వేగాలను బాగానే పండించింది. డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్ కు, పాత్రకు న్యాయం చేసింది. కానీ దర్శకుడు.. మృణాల్ రోల్ ను పూర్తిగా డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.

విజయ్ దేవరకొండ తో ఆమె కెమిస్ట్రీలో ఫ్రెష్ నెస్ కొరవడింది. సెకండాఫ్ లో మృణాల్ రోల్ కు పెద్ద స్కోప్ కూడా కనపడలేదు. కాబట్టి ఫ్యామిలీ స్టార్ రిజల్ట్.. మృణాల్ ఠాకూర్ ను పెద్ద బాధపెట్టలేదని చెప్పవచ్చు. డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ బాగా చేసుంటే ఆమె యాక్టింగ్ తో ఇంకా అదరగొట్టేసి ఉండేది. అందుకే ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెపై పెద్దగా ట్రోల్స్ చేయడం లేదు. చాలా వరకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు.

ఇక డైరెక్టర్ పరశురామ్ పై ఈ మూవీ ఎఫెక్ట్ గట్టిగానే పడిందని చెప్పవచ్చు. తన కొత్త సినిమా విషయంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్ద హీరోను ఒప్పించడం కొంచెం కష్టమే. విజయ్ దేవరకొండ కు కూడా ఈ మూవీ ఎదురుదెబ్బే. లైగర్ డిజాస్టర్ తర్వాత ఖుషితో పర్వాలేదనిపించిన విజయ్.. ఈ సినిమాతో భారీ హిట్ కొడదామని అనుకున్నా కుదరలేదు. మరి విజయ్, మృణాల్.. కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.