Begin typing your search above and press return to search.

లక్కీ హీరోయిన్ కి కష్టాలు మొదలయ్యాయా..?

టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ పడితే ఆ హీరోయిన్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది.

By:  Tupaki Desk   |   6 May 2024 12:30 PM GMT
లక్కీ హీరోయిన్ కి కష్టాలు మొదలయ్యాయా..?
X

టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ పడితే ఆ హీరోయిన్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొడితే ఆమెది లక్కీ హ్యాండ్ అని ముద్ర వేస్తారు. పరిశ్రమలో హిట్ పడితే వచ్చే ఎంకరేజ్మెంట్ తెలిసిందే. ఆ వెంటనే వరుస ఛాన్సులు వచ్చేస్తాయి. అయితే ఆ టైం లోనే తమ క్లవర్ నెస్ ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆఫర్లు వచ్చాయి కదా అని అన్నీ చేసుకుంటూ పోతే మాత్రం కెరీర్ రిస్క్ లో పడుతుంది. అలా అని మరీ ఆచి తూచి అడుగులేస్తూ పోతే కెరీర్ నెమ్మదిస్తుంది. తెలివిగా సరైన కథా ఎంపికలతో సక్సెస్ లు కొట్టాల్సి ఉంటుంది.

ఇదే క్రమంలో బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో నటించిన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అందుకున్న ఒక బ్యూటీ ఆ తర్వాత వచ్చిన సెకండ్ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది. రెండు హిట్లు పడ్డాక ఇక ఆమెకు తిరిగుంటుందా అనుకుంటే సడెన్ గా ఆమె కెరీర్ కు స్పీడ్ బ్రేక్ పడేలా థర్డ్ సినిమా ఫ్లాప్ అయ్యింది. సీతారామం తో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో తనకున్న ఇమేజ్ ను మించి క్రేజ్ తెచ్చుకుంది.

అక్కడ తనని కేవలం రొమాంటిక్ హీరోయిన్ గానే చూస్తున్నారు తప్ప లవ్ స్టోరీస్ ఛాన్సులు ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్న మృణాల్ తెలుగులో సీతారామం తో సూపర్ అనిపించుకుంది. ఆ తర్వాత నానితో చేసిన హాయ్ నాన్నతో కూడా మెప్పించింది. అయితే అదే ఊపుతో విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశపరచింది. సినిమా కథ కథనాలతో డైరెక్టర్ పరశురాం పూర్తిగా ఫెయిల్ అవ్వగా హీరోగా విజయ్ హీరోయిన్ గా చేసిన మృణాల్ నటన పర్వాలేదు అనిపించినా సినిమాను కాపాడలేకపోయింది.

రెండు హిట్లు కాదు ఒక్క ఫ్లాప్ పడేసరికి మృణాల్ గ్రాఫ్ కిందకు పడిపోయింది. తెలుగులో అమ్మడు ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా సైన్ చేయలేదు. రెండు హిట్లు పడ్డప్పుడు ఆహా ఓహో అన్న వారంతా ఇప్పుడు ఆమెను ఫ్లాప్ హీరోయిన్ అనేస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఆఫర్ కోసం అమ్మడు వెయిట్ చేస్తుండగా తెలుగులో మృణాల్ ఠాకూర్ కు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. మేకర్స్ ఆమెను కాదంటున్నారో లేదా హిట్ కథ కోసం అమ్మడు వెయిట్ చేస్తుందో కానీ మృణాల్ ఫోర్త్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఆమె గురించి ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.